టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ వివాదంలో చిక్కుకున్నారు.
ఎప్పుడూ ఏదో ఒక వార్తల్లో నిలిచే కళ్యాణ్ పై లేటెస్ట్ గా ఓ కేసు నమోదైంది. షేక్ పేట భూవివాదం పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో నిర్మాత కళ్యాణ్ పై కేసు ఫైల్ చేశాడు.
అమెరికాలో వైద్యుడిగా పనిచేస్తున్న స్వరూప్ 1985లో షేక్ పేటలో ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ నుండి భూమి కొన్నారు.ఈ స్థలాన్ని 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకి ఇచ్చాడు.
అప్పటి నుండి లీజుకి తీసుకున్న నారాయణ మూర్తి ఆర్గానిక్ స్టోర్ ను నడుపుతున్నారు.అయితే సోమవారం సాయంత్రం కళ్యాణ్ మనుషులు ముగ్గురు వచ్చి స్టోర్ కు తాళం వేశారు.

ఆర్గానిక్ స్టోర్ యజమాని వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.రంగంలో దిగిన పోలీసులు కళ్యాణ్ తో పాటు షరూఫ్, శ్రీకాంత్, తేజశ్విలపై కేసు నమోదు చేశారు.ప్రస్తుతం పోలీసుల్ ఈ విషయంపై విచారణ నిర్వహిస్తున్నారు.సి.కళ్యాణ్ ఇదివరకు కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకున్నారు.అయితే ఈ కేసు విషయమై నిర్మాత సి.కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.