జబర్దస్త్‌ పూర్తిగా రెండూ ఆది పైనే ఆధారం

జబర్దస్త్‌ అనగానే ఒకప్పుడు చంద్ర గుర్తుకు వచ్చేవాడు.ఆ తర్వాత తర్వాత సుడిగాలి సుధీర్ గుర్తుకు వచ్చేవాడు.

 Hyper Adi In Jabardast And Extra Jabardasth Two Episodes Continuously, Aadi, Aad-TeluguStop.com

ఆ తర్వాత తర్వాత కాలంలో ఆది పేరు మారు మ్రోగి పోతుంది.గడచిన మూడు నాలుగు సంవత్సరాలుగా జబర్దస్త్ అంటే ఆది.ఆది అంటే జబర్దస్త్ అన్నట్లుగా పరిస్థితి మారింది.మల్లె మాల వారు ఆదిపై ఎంతగా ఆధార పడుతున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.

ఆది జబర్దస్త్ లో మాత్రమే కనిపించేవాడు.ఇప్పుడు తర్వాత రోజు వచ్చే ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ లో కూడా కనిపిస్తున్నాడు.

మొదట సుడిగాలి సుధీర్ టీమ్‌ లో లేదంటే మరో టీమ్‌ లీడర్ కు మద్దతుగానో వచ్చేవాడు.కాని ఇప్పుడు మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్‌ లో సొంత టీమ్‌ తోనే కనిపిస్తున్నాడు.

ఆది ప్రత్యేక స్కిట్‌ అంటూ వేస్తున్నారు.ఈమద్య కాలంలో జబర్దస్త్‌ తో పోల్చితే ఎక్స్ ట్రా జబర్దస్త్‌ కు రేటింగ్‌ రావడం లేదట.

దాంతో ఎక్స్ ట్రా లో కూడా ఆదిని యాడ్‌ చేశారు అంటున్నారు.

గడచిన రెండు మూడు వారాలుగా ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌ లో ఆది ప్రత్యేక స్కిట్‌ లు వస్తున్నాయి.

ఈ స్కిట్స్ వల్ల మల్లె మాల వారు ఆశించినట్లుగానే రేటింగ్ పెరిగింది.ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ మొదట ఆది లేకుండా చేశారు.కాని ఇప్పుడు ప్రతి ఎపిసోడ్‌ లో ఆది ఉంటున్నాడు.సుడిగాలి సుధీర్ ఉంటున్నాడు.

కనుక ఆయన వల్ల రేటింగ్‌ మరో రేంజ్‌ లో వస్తోంది.

Telugu Aadi, Adi, Adi Jabardast, Chammak Chandra, Etv Jabardast, Jabardast, Jaba

ఇక ఢీ కి ఆది వల్ల వస్తున్న రేటింగ్‌ అంతా ఇంతా కాదు అనే విషయం తెల్సిందే.ఈ రెండు షోలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మల్లెమాల వారు టీవీ ప్లస్ కోసం తీసుకు వచ్చిన కామెడీ షో లో కూడా కనిపిస్తున్నాడు.ఇక సినిమా లు మరియు వెబ్‌ సిరీస్ ల్లో కూడా ఈయన కనిపిస్తున్నాడు.

ఇంతగా మనోడు కనిపించడం నిజంగా ఆశ్చర్యకర విషయమే.ప్రస్తుతం ఆది టైమ్‌ నడుస్తుందని ప్రతి ఒక్కరు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube