టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటికి హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తుంది.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
అలాగే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి రెండు వెబ్ సిరీస్ లని కంప్లీట్ చేసి మూడో దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇది సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా భిన్నమైన షేడ్స్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది.అందులో భాగంగా ఇప్పటికే మ్యాస్రోర్ సినిమాలో విలన్ గా నటించింది.
ఇప్పుడు బుల్లితెరపై మరో కొత్త అవకాతరంలో తమన్నా ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇండియన్ వైడ్ గా పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ రియాలిటీ షోని ఇప్పుడు తెలుగులో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ షోకి వాఖ్యతగా తమన్నాని ఫైనల్ చేశారు.దీనికి సంబందించిన వార్త ఇప్పటికే బయటకి వచ్చింది.
తాజాగా తమన్నా ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.త్వరలో మాస్టర్ చెఫ్ షోద్వారా కలుసుకుందాం అంటూ హిట్ ఇచ్చింది.
అయితే ఈ షో ఏ చానల్ లో టెలికాస్ట్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు.స్టార్ మా చానల్ ఈ షోని టెలికాస్ట్ చేస్తుందని, దీనికి సంబందించిన వర్క్ కూడా ఇప్పటికే స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే సమంతా ఆహలో సామ్ జామ్ తో యాంకర్ గా కొత్త అవతారం ఎత్తింది.ఇప్పుడు ఆమె దారిలోనే తమన్నా కూడా రియాలిటీ షో యాంకర్ గా మారిపోతుంది.
దీంతో పాటు ఆహలో ఒక టాక్ షో చేయడానికి తమన్నా ఒకే చెప్పినట్లు సమాచారం.