యంగ్ హీరో నితిన్ నటించిన మాస్ట్రో షూటింగ్ ముగిసింది.ప్రస్తుతం ఈ సినిమా విడుదల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కు మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహించగా నభా నటేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.ప్రముఖ హీరోయిన్ తమన్నా ఈ సినిమా లో కీలక పాత్రలో నటించింది.
మాస్ట్రో సినిమా చిత్రీకరణ ముగించిన యూనిట్ సభ్యులు వెంటనే విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ప్రకటించారు.వీరి వద్ద రెండు ఆప్షన్ లు ఉన్నాయని అంటున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు లో సినిమా ను విడుదల చేస్తారట.కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా పోయినట్లే.
మరో వైపు షూటింగ్ లు మొదలుకు అనుమతులు వచ్చాయి.థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది.
ఇక థియేటర్లు ఓపెన్ అయితే ఈ సినిమా విడుదల చేయాలని.ఓపెన్ కాకున్నా కూడా ఈ సినిమా ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.
నితిన్ ఈ ఏడాది ఇప్పటికే చెక్ మరియు రంగ్ దే సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా ల్లో ఒకటి పర్వాలేదు అనిపించుకోగా ఒకటి మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.మాస్ట్రో కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.రికార్డు స్థాయి స్పీడ్ తో ఈ సినిమా ను పూర్తి చేశారు.బాలీవుడ్ మూవీ అంధాదున్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.అక్కడ టబు చేసిన పాత్రను ఇక్కడ తమన్నా చేయడం ప్రత్యేక విషయంగా చెప్పుకోవచ్చరు.
ఇక ఈ సినిమా కు సంబంధించిన పలు విషయాలు సినిమా పై అంచనాలు పెంచేస్తున్నారు.మాస్ట్రో సినిమా ను ఆగస్టు లో థియేటర్లు ఓపెన్ అయితే థియేటర్ల ద్వారా లేదంటే ఓటీటీ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించారు.
మరి మాస్ట్రో ను మనం ఎలా చూడబోతున్నామో మరి కొన్ని రోజులు అయితే కాని చెప్పలేము.