ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల పై కన్నేసిన బీజేపీ.. వ్యూహాలు ఫలిస్తాయా.. ?

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రతికూల పరిస్దితులు ఎదురైన విజయాలను దక్కించుకుంటూ ముందుకు వెళ్లుతుందో, కేంద్రంలో కూడా బీజేపీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది.ఒకవైపు గ్యాస్, పెట్రోల్, ఢీల్లీలో రైతుల సమస్యలు ఇలా ఎన్నో అనుకూలంగా లేని పరిస్దితులను ఎదుర్కొంటు తనదైన వ్యూహరచనతో గెలుస్తూ వస్తుంది.

 Bjp Jp Nadda To Review 2022 Assembly Polls Strategy, Bjp, Jp Nadda, Review, 2022-TeluguStop.com

ఇక ఈ పార్టీలకు ఇప్పటి వరకు బలమైన ప్రత్యర్ది లేకపోవడం కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చూ.ఇదిలా ఉండగా వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌హా ఆరు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బీజేపీ ఇప్పటి నుండే ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటోందట.

ఇందులో భాగంగా ఈ నెల 5, 6వ తేదీల్లో ఎన్నిక‌ల వ్యూహాల‌పై చ‌ర్చించేందుకు బీజేపీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా స‌మావేశం కానున్నారని సమాచారం.ఇకపోతే వచ్చే సంవత్సరంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, పంజాబ్‌, గోవా, ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్, గుజ‌రాత్‌ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ క్రమంలో ముందుగానే రాజకీయ ఎత్తులతో ప్రత్యర్ధులను చిత్తుచేయడానికి బీజేపీ రచిస్తున్న వ్యూహలు ఫలిస్తాయా లేదా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube