మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై భూ వివాద కేసు.. మండిప‌డుతున్న ప్ర‌తిప‌క్షాలు

తెలంగాణ‌లో ఇప్ప‌టికే భూ క‌బ్జా కేసుల చుట్టూ రాజ‌కీయాలు కుత‌కుత ఉడుకుతున్నాయి.ముఖ్యంగా టీఆర్ ఎస్ నేత‌లపై గ‌తంలో అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

 Land Dispute Case Against Another Trs Mla Burning Oppositions, Trs Mla, Land Cas-TeluguStop.com

అనేక న్యూస్ ఛాన‌ళ్ల‌లో బాధితులు త‌మ ఆవేద‌న‌ను తెలిపాయి.అయితే పెద్ద‌గా కేసులు ఎన్న‌డూ న‌మోదు కాలేదు.

కానీ ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్‌పై విచార‌ణ జ‌రిపించారో అప్ప‌టి నుంచి టీఆర్ ఎస్ నేత‌ల‌పై బ‌హిరంగంగానో బాధితులు కేసులు పెడుతున్నారు.

ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యేపై కేసు న‌మోదైంది.

టీఆర్ ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు భూ క‌బ్జాలు చేస్తున్నారంటూ గ‌తంలో కూడా అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి.ఎంతోమంది టీవీలు, మీడియా ముందుకు వ‌చ్చి మ‌రీ ఆధారాలు చూపిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఉప్ప‌ల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, కాప్రా త‌హ‌సీల్దార్‌పై జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్‌లో కేసు న‌మోదైంది.త‌న భూమిని కావాలాని లాక్కునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని జూల‌కంటి నాగ‌రాజు అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

త‌న భూమిని క‌బ్జాచేసేందుకు చూస్తున్నార‌ని తెలిపాడు.

అయితే కాప్రా ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 152లో గ‌ల త‌న‌భూమిని కావాల‌నే ఎమ్మెల్యే, అత‌ని అనుచ‌రులు పెన్సింగ్‌ను తొల‌గించార‌ని నాగ‌రాజు ఆరోపించాడు.

ఆ భూమి క‌స్టోడియ‌న్‌లో కి వ‌స్తుందంటూ క‌ట్టుక‌థ‌లు చెప్పి తొల‌గించార‌ని వాపోయాడు.ఈ తొల‌గింపుకు ఏకంగా త‌హ‌సీల్దార్ స‌పోర్టు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడు.ఎమ్మెల్యే అనుచ‌రులు కొంత‌మంది త‌న‌ను చంపుతామ‌ని బెదిరిస్తున్నారంటూ వాపోయాడు.

త‌నకు న్యాయం చేయాల‌ని, త‌న భూమిని త‌న‌కు ఇప్పించాలంటూ కోరుతున్నాడు.

ఇందుకోసం ఎంత వ‌ర‌కైనా పోరాడుతాన‌న్నాడు.ఇక ఈ విష‌యం తెలుసుకున్న ప్ర‌తిపక్షాలు భ‌గ్గుమంటున్నాయి.

టీఆర్ ఎస్ నేత‌లంతా భూ క‌బ్జాకోరుల‌ని, పేద‌ల భూముల‌పైనే వారి క‌న్ను అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.వెంట‌నే ఆ భూమిపై కూడా విచార‌ణ జ‌రిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

మొత్తానికి ఇప్పుడు టీఆర్ ఎస్‌కు మ‌రో దెబ్బ అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube