తెలంగాణలో కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల విషయంలో ఇప్పటికే కోర్టు కూడ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.అంతే కాదు ఈ రాష్ట్రం లో కోవిడ్ ట్రీట్మెంట్ చేస్తున్న ప్రైవేట్ హాస్పటల్స్ వేస్తున్న బిల్లుల విషయం లో కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో తీవ్రంగా విమర్శలు ఎదురవుతున్నాయి.
అంతే కాదు కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని ఎమ్మెల్యే సీతక్క నిరసన కూడా తెలియచేశారు.
అయినా ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు.
అయితే తాజాగా ప్రజల పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే సీతక్క అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి అక్కడే శాంతియుత నిరసనను కొనసాగిస్తున్నారు.ఈ క్రమంలో కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదే కాకుండా కోవిడ్ విషయంలో తీసుకోవలసిన పలు చర్యలను తెలియపరస్తూ తక్షణమే కరోనా పేషెంట్స్ పట్ల బాధ్యతాయుతంగా మెలగాలని, ఎన్నికలప్పుడే కాదు ఇలాంటి కష్ట సమయంలో కూడా ప్రజల పై ప్రేమ, ఆదరణ చూపించాలని వెల్లడించారు.