ఫ్యాన్ కలను నెరవేరుస్తానన్న కియారా.. ఏమైందంటే..?

టాలీవుడ్ లో భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించి కియారా అద్వానీ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారని తెలుస్తోంది.

 Kiara Advani Reply To Her Fan In Social Media, Goes Viral , Kiara Adwani , Repl-TeluguStop.com

అయితే కియారానే హీరోయిన్ గా ఫైనలైజ్ అయినట్టు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.కియారా అద్వానీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

Telugu Kiara Adwani, Reply Fan-Movie

తాజాగా ఒక అభిమాని కియారా అద్వానీని కలవడం తన డ్రీమ్ అని ట్వీట్ చేశారు.ఢిల్లీకి కియారా అద్వానీ షూటింగ్ కోసం వచ్చిన సమయంలో తాను కలిసే ప్రయత్నం చేసినా వీలు కాలేదని ఆ వ్యక్తి కియారాతో చెప్పారు.ఢిల్లీలో కియారా అద్వానీ సినిమా షూటింగ్ జరిగితే తాను వచ్చి కలుస్తానని నెటిజన్ పేర్కొన్నారు.అయితే ఫ్యాన్ కలను తెలుసుకున్న కియారా అద్వానీ తప్పకుండా ఫ్యాన్స్ కలను నెరవేరుస్తానని చెప్పారు.

అతి త్వరలో నెటిజన్ కన్న కల నెరవేరుతుందంటూ కియారా నెటిజన్ కు సమాధానమిచ్చారు.నెటిజన్ ట్వీట్ కు కియారా అద్వానీ ఇచ్చిన రిప్లైను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ప్రస్తుతం కియారా అద్వానీ చేతిలో షేర్షా, భూల్ భూలయ్యా సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ఉన్నాయి.ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కియారా తీరును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

తమిళంలో కూడా కియారాకు ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ లోనే ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు ఉండటంతో కియారా ఇతర ఇండస్ట్రీల నుంచి వస్తున్న ఆఫర్లకు ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

కియారా ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.జూన్ నెల మూడవ వారం నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలు కానుండగా ఈ సినిమాలో కియారా నటిస్తారో లేక మరో హీరోయిన్ నటిస్తారో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube