సినిమా టైటిల్ చెప్పలేదని 'డైరెక్టర్'ను ఎత్తి కుదేసిన నటుడు!

ఈమధ్య సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది యూజర్స్ ఫాలోవర్స్ తమకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తుంటారు.సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియా బాగా కనెక్ట్ అయ్యింది.

 Actor Siddhanth Chaturvedi Attacks Director Shakun Batra Over Movie Title , Acto-TeluguStop.com

ఇక ప్రతి ఒక్క విషయాన్ని పంచుకోగా మరికొంతమంది యూజర్స్ ఎన్నో సీరియస్, ఫన్నీ వీడియోస్ లను కూడా పంచుకుంటారు.ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరో సినిమా టైటిల్ చెప్పలేదని ఏకంగా ఆ సిని డైరెక్టర్ నే ఎత్తి పడేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ చతుర్వేది.

ప్రస్తుతం సిద్ధార్థ్‌.శకున్ బాత్రా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తుంది.అంతేకాకుండా దీపిక పదుకొనే, అనన్య పాండే కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా గతంలో లాక్ డౌన్ తర్వాత గోవా, ముంబైలో జరిగింది.ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవగా.

ఈసారి ఇక హీరో నోటి నుండే సినిమా టైటిల్ గురించి ప్రశ్న ఎదురయింది.

సినిమా టైటిల్ చెపుతావా లేదా అంటూ సిద్ధార్థ్ చతుర్వేది డైరెక్టర్ ను అడుగగా, నేను చెప్పను అని డైరెక్టర్ శకున్ అనే సరికి వెంటనే సిద్ధార్థ్ కోపంతో డైరెక్టర్ గొంతు పట్టుకుని పైకి ఎత్తి పడేసాడు.కానీ ఈ ఘటన సీరియస్ గా జరిగిందా అనుకోకండి.కేవలం సరదా కోసం సిద్ధాంత్ అలా చేయగా మరోసారి విఫలయత్నం చేశానంటూ, అప్పటివరకు ఈ సినిమాను శకున్ బాత్రా తర్వాత సినిమా అనాల్సిందే అంటూ కామెంట్ చేశాడు.

ఇక ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube