కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.ఇప్పటికే విద్యార్థులకు ఒక సంవత్సరం కాలం వృధా అయింది.
మళ్లీ ఇప్పుడు కూడా కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుండటంతో విద్యా సంస్థలను మూసి వేయాల్సిన పరిస్థితి వస్తోంది.కరోనా మహమ్మారి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేం కాబట్టి పాఠశాల యాజమాన్యాలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల సమయాన్ని వృధా కాకుండా చూసుకుంటున్నాయి.
అయితే పేద విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలను వినగలిగేంత స్తోమత ఉండడం లేదు.స్మార్ట్ ఫోన్ తో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం అత్యవసరం కాబట్టి పేద విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నారు.
అయితే ఇలాంటి విద్యార్థులకు కూడా పాఠాలు చెప్పాలని పేదరికం వారికి ఒక శాపం లా మారకూడదని ఒక ప్రభుత్వ టీచర్ ఒక వినూత్నమైన ఆలోచన తో ముందడుగు వేస్తూ అందరి ప్రశంసలు తగ్గించుకుంటున్నారు.

పూర్తి వివరాలు తెలుసుకుంటే మధ్యప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అయిన శ్రీవాస్తవ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు స్మార్ట్ మొబైల్ ఫోన్లు కొనేస్తున్నారు.పేద విద్యార్థులకు పుస్తకాలను కూడా అందిస్తున్నారు.తన స్కూటర్ ని ఒక స్కూలు లాగా మార్చేసిన ఆయన రోడ్డు మీదనే తన విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఆశ్చర్యపరుస్తున్నారు.
తన స్కూటీ సీట్ పైభాగంలో మినీ మొబైల్ స్కూల్ ఏర్పరిచారు.ఒకవైపు బ్లాక్ బోర్డ్ మరొకవైపు లైబ్రరీ ఉండేలాగా ఆయన తన చిన్న స్కూల్ ని డిజైన్ చేయించారు.
తన లైబ్రరీలో ఉన్న పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు.అయితే ఆ పుస్తకాలను పిల్లలు రెండు మూడు రోజులు చదువుకొని తర్వాత తిరిగి శ్రీవాస్తవ కి ఇచ్చేయొచ్చు.
కరోనా పీడ దినాల్లో విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గకుండా తన వంతు కృషి చేస్తున్న శ్రీవాస్తవ కి ఎవరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.ప్రతి ఒక్కరూ చదువుకుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఈ విధంగా ఏ ఉపాధ్యాయుడు చెయ్యని కృషి చేస్తున్నారు.