చాలా మందికి జేమ్స్ బాండ్ మూవీస్ అంటే చాలా మక్కువ.మీరు ఎక్కువగా జేమ్స్ బాండ్ మూవీలను చూస్తారా.? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్ .ఈ బంపర్ ఆఫర్ మీకు కావాలంటే ఇప్పటి వరకు జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన అన్ని మూవీలను మీరు చూడాల్సి ఉంటుంది.అలా చూస్తే ఏకంగా 1000 డాలర్లు గెలుచుకోవచ్చు.అంటే మన కరెన్సీ లోసుమారు రూ.72 వేలు అన్నమాట.
నో టైమ్ టు డై జేమ్స్ బాండ్ సిరీస్‌లో కొత్త మూవీ.
నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2020లో విడుదల కావల్సి ఉంది.కానీ కరోనా వల్ల విడుదలను వాయిదా మీద వాయిదా వేశారు.
ఈ క్రమంలోనే ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.అయితే జేమ్స్ బాండ్ మూవీల ఫ్యాన్స్ ను అప్పటి వరకు వెయిట్ చేయించడం ఇష్టంలేకపోవడంతో నెర్డ్ బియర్ అనే వెబ్ సైట్ వారు బంపర్ ఆఫర్ ను ప్రకటించారు.
ఇంతకి ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా.? మొత్తం 24 జేమ్స్ బాండ్ మూవీలను 30 రోజుల్లోగా చూడాలి.అంతే కాకుండా చూసిన వెంటనే వాటిని చూసినట్లు వెబ్‌సైట్ లో రిజిస్టర్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇవ్వాలి.దీంతో ఈ విధంగా చేసిన చాలా మంది ఫ్యాన్స్ నుంచి ఒక లక్కీ ఫ్యాన్ ను ఎంపిక చేసి ఆ ఫ్యాన్ కు 1000 డాలర్లను అందిస్తారు.
అంతేకాకుండా వారికీ అమెజాన్, ఏఎంసీ గిఫ్ట్ కార్డులను అందిస్తారు.మరింకెందుకాలస్యం.మీరు జేమ్స్‌బాండ్ ఫ్యాన్ అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనండి.1000 డాలర్లను గెలుచుకోండి.మరి కొన్ని వివరాలకు https://nerdbear.com/get-paid-1000-to-binge-watch-james-bond-movies/ అనే సైట్‌ను సందర్శించవచ్చు.