ధర్మం కోసం తుపాకి పట్టిన సిద్ధ.. కేక పెట్టించిన ఆచార్య కొత్త పోస్టర్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య చిత్ర యూనిట్ మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే డబుల్ ట్రీట్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా అందించింది.ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తుండగా, ఓ పవర్‌ఫుల్ కేమియో పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Ram Charan New Poster From Acharya Movie, Ram Charan, Acharya, Siddha, Chiranjee-TeluguStop.com

కాగా ఈ సినిమాలో చరణ్ పాత్ర పేరు ‘సిద్ధ’ అనే విషయాన్ని చిత్ర దర్శకుడు కొరటాల శివ గతంలోనే వెల్లడించాడు.అయితే నేడు చరణ్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాలోని చరణ్ లుక్‌ను రివీల్ చేసారు చిత్ర యూనిట్.

సిద్ధ అనే పాత్ర ఎలా ఉంటుందా అనే ఆసక్తికి తెరదించుతూ, ఈ సినిమాలో చరణ్ ఓ నక్సలైట్ పాత్రలో మనకు కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ రివీల్ చేశారు.ఈ సినిమాలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ పాత్ర ఉండబోతుందని, అందులో చిరు కూడా ఉంటాడని ఈ పోస్టర్ చూస్తే ఇట్టే అర్థం అవుతోంది.

ఇక ఈ పోస్టర్‌లో చిరుతో పాటు చరణ్ కూడా తుపాకీ పట్టుకుని మనకు కనిపించారు.అయితే ఈ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు కొరటాల శివ ‘ధర్మానికి ధైర్యం తోడైన వేళ’ అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌ను పెట్టడంతో ఈ పోస్టర్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది.

మెగాస్టార్ సినిమాలో చరణ్ కేమియో ఏ రేంజ్‌లో ఉండబోతుందా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమాలో సిద్ధ పాత్ర మామూలుగా ఉండదనే విషయాన్ని మనకు ఈ కొత్త పోస్టర్ తెలియజేస్తుంది.ఇక ఆచార్య చిత్రంలో చిరంజీవి చేయబోయే పాత్ర కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగే అన్యాయాలను ఎదురించే వ్యక్తిగా ఆచార్య కనిపిస్తాడని ఈ చిత్ర టీజర్‌లో మనకు చూపించారు.

మొత్తానికి చరణ్ పుట్టినరోజు నాడు మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులకు అదిరిపోయే డబుల్ ట్రీట్ ఇచ్చిన ఆచార్య చిత్రం, వేసవి కానుగా మే 13న రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube