మనిషి రూపంలో ఉన్న కీచక టీచర్.. ఇలా ఎంత కాలం.. ?

చక్కని సమాజాన్ని తీర్చిదిద్ద వలసిన బాధ్యత ముఖ్యంగా ఉపాధ్యాయుల పై ఉంది.ఎందుకంటే చిన్న వయస్సులోనే స్కూళ్లకు వెళ్లే పిల్లల మనసుల్లో మంచి ఆలోచనలు, సమాజంలో ఉన్నతంగా ఎలా బ్రతకాలి అనే సమకాలీన అంశాలను వారి హృదయాల్లో నింపితే అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత చెడు చేయాలంటే ఆలోచిస్తారు.

 Cheraala Teacher Sexual Harassment Of Students, Prakasam, Cheraala, Teacher, Sex-TeluguStop.com

అంటే సమాజంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉన్నతంగా ఉంటే వారి వద్ద చదివే పిల్లల ఆలోచనలు కూడా అంతే పవిత్రంగా మలచబడతాయని అనుకోవడంలో తప్పు లేదు.కానీ నేడు ఉపాధ్యాయులు అంటే దాదాపుగా కామంతో రగిలే కీచకుల్లా మారుతున్నారు.

కన్న బిడ్డల్లా చూసుకోవలసిన వారు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లేకి పనులకు పాల్పడుతున్నారు.

ఇకపోతే ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో పని చేస్తున్న సురేష్ గత కొంత కాలంగా విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలతో రెండుసార్లు సస్పెండ్ అయ్యాడని స్థానికులు చెబుతున్నారు.

తిరిగి ఉద్యోగంలోకి చేరిన ఇతనిలో ఎలాంటి మార్పు కలగక మళ్లీ అదే తప్పు చేస్తూ దొరికిపోయాడు.

ఇలా ఒంటరిగా ఉన్న అమ్మాయిలను అసభ్యంగా టచ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న సురేష్ ఆగడాలు రోజురోజుకు మితిమీరుతుండడంతో విషయాన్ని ఆ పిల్లలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇక ఇలాంటి కామ మృగాన్ని కఠినంగా శిక్షిస్తే గానీ సమాజం బాగుపడదు.లేదంటే ఇలా ఎంతకాలం ఈ మృగాలను భరిస్తూ విద్యార్ధినులు వేదన పడాలని ప్రశ్నిస్తున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube