టాలీవుడ్ సినీ నటుడు ఆనంద్ దేవరకొండ.అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ సోదరుడైన ఆనంద్.దొరసాని సినిమా తో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు.తొలిసారి నటనకు మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ.ఆ తర్వాత మరో సినిమాలో అవకాశాన్ని అందుకున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో ఆనంద్ తెగ ఇరగదీశారు.
హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక హీరోయిన్ నటించిన మొదటి సినిమా దొరసాని.ఈ సినిమాతో తన నట జీవితాన్ని తొలిసారిగా పరిచయం చేసిన ఆనంద్ దేవరకొండ హీరోగా నటించాడు.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ లో మంచి కథలో హీరోగా నటించాడు.
ఇక ఈ సినిమా ఓటిటి ద్వారా విడుదల కాగా మంచి ప్రశంసలు వచ్చాయి.ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో సినిమా పుష్పక విమానం తో రానున్నాడు ఆనంద్.
డెబ్యూ దామోదర దర్శకత్వం లో తెరకెక్కనున్న సినిమా పుష్పక విమానం.ఇందులో ఆనంద్ హీరోగా నటించనుండగా.గీత్ సైని, సాన్వే మేఘన లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక గోవర్ధనరావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఆనంద్ నటించిన మొదటి రెండు సినిమాల్లో డాన్స్ అంతగా లేకపోయేసరికి.ప్రస్తుతం పుష్పకవిమానం సినిమా కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
తాజాగా ఆనంద్ డాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ గా మారింది.ఆ సినిమాలో సిలకా పాటకు డాన్స్ చేస్తూ బాగా ఆకట్టుకున్నాడు.
ఇక ఈ పాటను రామ్ మిరియాల అందించారు.మొత్తానికి ఆనంద్ డాన్స్ స్టెప్పులతో తెగ అదరగొట్టాడు.