కొరటాల శివ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలిస్తే?

సినిమా అనేది సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే గొప్ప మాధ్యమం.సినిమా ద్వారా సమస్యలకు పరిష్కారం దొరకకపోవచ్చు కాని సమస్యలని టార్చ్ వేసి చూపించి ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన తీసుకురాగలగినంత వరకు సినిమా అనేది పనిచేస్తుంది.

 Why Koratala Shiva Did Not Want Children,koratala Shiva,chiranjeevi, Koratala S-TeluguStop.com

అయితే ఆ సమస్యలకు పరిష్కారం మాత్రం సినిమా తీసుకరాలేదు.అందుకే ఏదన్నా చెప్పాలనుకున్నా సినిమా ద్వారా చెప్పాలనే చాలా మంది దర్శకులు ప్రయత్నిస్తుంటారు.

కాని ఎంత కాదన్నా సినిమా అనేది వ్యాపారం.అందులో వ్యాపార మెలకువల ఆధారంగానే సినిమా నిర్మాణం అనేది నడుస్తుంది.

అయితే అన్ని కమర్షియల్ యాంగిల్స్ ను జోడించి సందేశాత్మకంగా కూడా మనం చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా చెప్పొచ్చు.కాని అది ఎంత పెద్ద రిస్క్ అనేది సినిమా పరిశ్రమకు చెందిన వారికి మాత్రమే తెలుస్తుంది.

Telugu Acharya, Chiranjeevi, Koratala Shiva-Latest News - Telugu

అయితే ఇలా ఓ సోషల్ మెసేజ్ తో సినిమాలు తీస్తూ అన్నీ సూపర్ హిట్ లు కొట్టిన ఏకైక దర్శకుడు కొరటాల శివ.ఇప్పటివరకు కొరటాల సినిమాలు ఏవీ ఫ్లాప్ కాలేదంటే కమర్షియల్ యాంగిల్స్ ను జోడిస్తూనే ఎక్కడా నీతి వ్యాక్యాలు బోధిస్తున్నట్టుగా ఉండకుండా పాత్రలో భాగంగానే అందులోనే ఒక మాట రూపంలో సందర్భోచితంగా చెప్పబడుతుంది.అయితే కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాను చేస్తున్నాడు.అయితే సినిమాల పరంగా కొరటాల శివ గురించి తెలుసు కాని, అయన గురించిన వ్యక్తిగత విషయాలు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుస్తాయి.

అయితే కొరటాల శివకు సంతానం లేదు.కొరటాల శివ దంపతులే స్వయంగా వద్దనుకొని నిర్ణయం తీసుకున్నారు.అయితే తన వ్యయాన్ని, తన భార్య జీతంలో సగాన్ని ప్రపంచం కొరకే ఖర్చు పెడుతున్న మహానుభావుడు కొరటాల శివ.అయితే సమాజం గురించే తాను పిల్లలను వద్దనుకున్నట్లు, కష్టాలలో ఉన్న వారు ఎంతో మంది ఉన్నారని, మా స్థాయికి తగ్గట్లు మేము కొంత ఖర్చు చేసేందుకు నిర్ణయుంచుకు న్నామని తెలిపారు.మెగాస్టార్ చిరంజీవి సైతం కొరటాల శివ లాంటి గొప్ప మనిషిని నేనెక్కడా చూడలేదని ప్రశంశసించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube