మసూర్ పప్పుదీనినే ఎర్ర కంది పప్పు అని కూడా పిలుస్తుంటారు.మసూర్ పప్పుతో దాల్, సూప్స్ ఎక్కువగా చేస్తుంటారు.
మసూర్ పప్పు రుచిగా ఉండటమే కాదు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
అటువంటి మసూపర్ పప్పు కేవలం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.మరి మసూర్ పప్పును చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మసూర్ పప్పును మెత్తగా పౌడర్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్‌లో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా మూడు రోజులకు ఒక సారి చేయడం వల్ల ముఖంపై డార్క్ స్పాట్స్ సమస్య దూరం అవ్వడంతో పాటు ముఖం తాజా కూడా మారుతుంది.
అలాగే ఒక బౌల్‌లో తీసుకుని అందులో మసూర్ పప్పు పౌడర్, శెనగపిండి మరియు ఎగ్ వైట్ వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి.బాగా ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు జల్లి మెల్ల మెల్లగా రుద్దుతూ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ దూరమై ముఖం కాంతివంతంగా నిగనిగలాడుతుంది.
ఇక మసూర్ పప్పు వాటర్‌లో ఒకటి లేదా రెండు గంటలు నానబెట్టి ఆ తర్వాత రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో నిమ్మరసం మరియు పెరుగు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించాలి.పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముడతలు తగ్గి ముఖం యవ్వనంగా మారుతుంది.
.