మానవత్వాన్ని చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది.. ఇంతకు ఏం చేశారంటే.. ?

మానవత్వం, మంచితనం లోకంలో ఇంకా బ్రతికే ఉందని అక్కడక్కడ ఎప్పుడో ఒక్క సారి జరిగే ఘటనలు నిరూపిస్తున్నాయి.ప్రస్తుతం చదవబోయే ఘటన కూడా ఇలాంటిదే.

 Woman Dead In Bus Rtc Staff Expressing Humanity Woman Dead, Bus, Rtc Staff, Expr-TeluguStop.com

కాగా ఆర్టీసీ డ్రైవర్లు ఎలా ఉంటారో అందరికి తెలిసిందే.కొందరైతే ఎవరి మాట వినని సీతయ్యల్లా ప్రవర్తిస్తారు.

కానీ బస్సులో మరణించిన మృతదేహాన్ని జాగ్రత్తగా వారి ఇంటికి చేర్చి మాయం అవుతున్న మంచికి ఆయువు పోశారు.ఆ వివరాలు చూస్తే.

పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ, నర్సాపురం డిపోకు చెందిన బస్సులో, హైదరాబాద్ లోని కూకట్‌పల్లి నుండి పాలకొల్లు బయలుదేరారు.కాగా ఈ బస్సు విజయవాడ చేరుకునేలోపు ఎప్పుడు ఆగిపోయిందో ఊపిరి తెలియదు గానీ బస్సులోనే మరణించింది.

అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఆర్టీసీ డ్రైవర్ వెంటనే 108కి సమాచారం అందించారు.వారు ఘటన స్దలానికి చేరుకుని ఈ మహిళ మరణించిందని దృవీకరించారట.

ఇక వార్త ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలుపగా బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులకు వేరే బస్సు కేటాయించి, ఆది లక్ష్మి మృతదేహాన్ని అదే బస్సులో స్వగ్రామానికి తరలించి మానవత్వాన్ని చాటు కున్నారు.కాగా ఆర్టీసీ బస్సులో మృతదేహాన్ని తరలించడం ఇదే మొదటిసారి అని విజయవాడ బస్ స్టేషన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ రాధాకృష్ణ మూర్తి వెల్లడించారు.

నిజంగా వీరి మానవత్వానికి హట్సాఫ్ చెప్పవలసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube