రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమములో.ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
పార్టీ గుర్తులపై జరగబోతున్న నేపథ్యంలో ఎలాగైనా సత్తా చాటాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి.పరిస్థితి ఇలా ఉండగా ఎన్నికలలో చాలా పార్టీలు గెలవటానికి భారీగా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆయన తీసుకున్న నిర్ణయంతో ఏపీ లో ఉన్న అన్ని పార్టీల పొలిటికల్ లీడర్లు భయపడి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.మేటర్ లోకి వెళ్తే ఎన్నికలలో డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు దొరికితే వెంటనే వారి వివరాలను ఐటీకి అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
డబ్బుల పంపిణీ అదేవిధంగా ఎన్నికల ఖర్చుపై ప్రత్యేకమైన టీంతో నిఘా పెట్టినట్టు ఎస్ఈసీ స్పష్టం చేశారు.ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం అదేవిధంగా తిరుపతి వంటి నగరాల్లో బాగా డబ్బులు పంపిణీ కార్యక్రమం జరుగు తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు నిమ్మగడ్డ పేర్కొన్నారు.