ఆ ఒక్క‌డి అరెస్టుతో టీడీపీ రాజ‌కీయం మారిపోయిందే ?

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో పాగా వేయాల‌నే టీడీపీ ఆశ‌లు ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు.అస‌లే నాయ‌కుల కొర‌త‌తో అల్లాడుతున్న టీడీపీకి ఇప్పుడు బీటెక్ ర‌వి రూపంలో మ‌రో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. 2018 మార్చి 4న రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో రవిని అరెస్ట్ చేసిన పోలీసులు క‌ప‌డ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన విష‌యం సంచ‌ల‌నం సృష్టించింది.అయితే, ఈ విష‌యం ఇత‌ర పార్టీ నేత‌ల‌ను కూడా హ‌డ‌లెత్తించింది.

 Has Tdp Politics Changed With That One Arrest?, Ap, Ap Political News, Latest Ne-TeluguStop.com

నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక‌రిద్ద‌రు టీడీపీ త‌ర‌ఫున మాట్లాడేవారు.అయితే, బీటెక్ ర‌వి ఘ‌ట‌న త‌ర్వాత ఏ ఒక్క‌రూ ముందుకు రావ‌డం లేదు.

నిజానికి పార్టీలో బ‌లంగా ఉంటార‌ని భావించిన సీఎం ర‌మేష్‌, ఆదినారాయ‌ణ‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి వంటి కీల‌క నాయ‌కులు .పార్టీ నుంచి బ‌య‌ట‌కువెళ్లిపోయారు.వీరిలో రామ‌సుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లిపోగా.మిగిలిన చాలా మంది నాయ‌కులు బీజేపీ వైపు వెళ్లిపోయారు.దీంతో ఇప్పుడు టీడీపీ జెండా మోసే నాయ‌కులు క‌నిపించ‌డం లేదు.ఇక‌, ఉన్న‌వారిలో బీటెక్ ర‌వి దూకుడుగా ఉన్నారు.

ఆ మ‌ధ్య మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా త‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి ఒకింత దూకుడు కూడా ప్ర‌ద‌ర్శించారు.

Telugu Adi Yana Reddy, Ap, Chandra Babu, Cm Ramesh, Jagan, Kadapa, Latest, Game,

ఇక‌, అప్ప‌టి నుంచి వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.ఎప్పుడో కేసును తిర‌గ‌దోడ‌డం వంటి ఘ‌ట‌న జిల్లాలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఫ‌లితంగా ఇత‌ర పార్టీ నాయ‌కులు, చోటా మోటా లీడ‌ర్లు కూడా ముందుకు రావ‌డం లేదు.చంద్ర‌బాబు పిలుపునిచ్చినా.ఎవ‌రికి వారు ఏ కార్య‌క్ర‌మ‌మూ చేసేందుకు ఉత్సాహం చూపించ‌డం లేదు.

చాలా మందిపై కేసులు ఉండ‌డంతో ఇప్పుడు టీడీపీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తే.

త‌మ‌పై ఆ కేసుల‌ను ఎక్క‌డ తిర‌గ‌దోడ‌తారోన‌ని భ‌యానికి గుర‌వుతున్నారు.అయితే.

ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి కూడా ఎవ‌రిలోనూ ధైర్యం నింపే ప్ర‌య‌త్నం మాత్రం చేయ‌క‌పోవ‌డం మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌య‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి ఎప్ప‌టికి టీడీపీ క‌డ‌ప‌లో పుంజుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube