సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు హీరోయిన్ల ను లవ్ మ్యారేజ్ చేసుకుంటారు.కొందరు సినిమా తో సంబంధం లేని వ్యక్తులను లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు.లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయిన టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీ కపుల్స్ మధ్యన ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో ఇప్పుడు చూద్దాం
నాగచైతన్య సమంత :
గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సమంత తెలుగులో ఒక మంచి హిట్ ని కొట్టారు అయితే అక్కడే నాగచైతన్య తో సమంత కి పరిచయం అవడం ఆ తర్వాత నాగచైతన్యతో ఆటోనగర్ సూర్య లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించడం వల్ల మంచి ఫ్రెండ్స్ అయినా వీళ్లిద్దరూ తర్వాత లవర్స్ గా మారి పెళ్లి చేసుకున్నారు అయితే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత అంటే సమంతా కంటే నాగచైతన్య ఒక సంవత్సరం పెద్ద ఇప్పుడు తెలుగులో నాగ చైతన్య విక్రమ్ కె.కుమార్ డైరెక్షన్ లో థాంక్యూ సినిమా చేస్తున్నాడు.సమంత కూడా పెళ్లి తర్వాత రామ్ చరణ్ తో రంగస్థలం సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రస్తుతం వెబ్ సిరీస్లు చేస్తుంది.
సూర్య జ్యోతిక :
సూర్య జ్యోతికలది లవ్ మ్యారేజ్ వీళ్లిద్దరూ కలిసి ఏడు సినిమాల్లో నటించారు గౌతమ్ మీనన్ తమిళంలో తీసిన కాకా కాకా సినిమాతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది సూర్య జ్యోతికల లవ్ స్టోరీ చాలా చిత్రంగా ఉంటుంది అమ్మాయి తో మాట్లాడాలి అంటే సిగ్గుతో భయపడే సూర్య జ్యోతిక ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి మొదట్లో జ్యోతికతో ఎక్కువగా సినిమాలు చేశాడు.అప్పుడు సూర్య అసలు మాట్లాడక పోయేవాడట సూర్యా లోని సిగ్గుని గమనించిన జ్యోతిక అతని దగ్గరికి వెళ్లి చిన్న చిన్న గా మాట్లాడడం మొదలు పెట్టిందట తర్వాత ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మరి పెళ్లి చేసుకున్నారు సూర్య కంటే జ్యోతిక మూడు సంవత్సరాలు చిన్నది.
వరుణ్ సందేశ్ వితిక :
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో నలుగురు హీరోల్లో ఒకరిగా ఇండస్ట్రీ కి పరిచయమైన వరుణ్ సందేశ్ అనతికాలంలోనే సోలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.కొత్త బంగారులోకం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.పడ్డానండి ప్రేమలో సినిమాలో నటించిన వితిక నీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ప్రస్తుతం వరుణ్ సందేశ్ సినిమాలు ఏమి చేయట్లేదు.
అయితే వరుణ్ సందేశ్ వితిక బిగ్ బాస్3 లో పార్టిసిపెట్ చేసి మంచి కపుల్స్ గా జనాలు అందరిచేత పేరు సంపాదించారు.వరుణ్ సందేశ్ కంటే వితిక మూడు సంవత్సరాలు చిన్నది.
రామ్ చరణ్ ఉపాసన :
చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చిరుత సినిమాతో హీరోగా మంచి గుర్తింపు పొందాడు ఆ తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీలో లో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న త్రిబుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు ఈ ప్రాజెక్టు తర్వాత సౌత్ ఇండియాలోనే టాప్ డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు.ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు,రామ్ చరణ్ కంటే ఉపాసన ఐదు సంవత్సరాలు చిన్నది.
నాగార్జున అమల :
నాగార్జున అమల ఇద్దరూ చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు శివ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి ఇద్దరు బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు అయితే నాగార్జున రామానాయుడు కూతురు అయిన లక్ష్మిని మొదటగా పెళ్లి చేసుకొని నాగచైతన్య పుట్టిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవడంతో వాళ్ళిద్దరు డైవర్స్ తీసుకున్నారు ఆ తర్వాత నాగార్జున అమలని పెళ్లి చేసుకున్నాడు నాగార్జున కంటే అమల 8 సంవత్సరాలు చిన్నది.
జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి :
టాలీవుడ్ లో ఏ పాత్ర అయినా అలవోకగా చేసే నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే చెప్పాలి.ఎన్టీఆర్ సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు సాధించారు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అయితే ఎన్టీఆర్ కంటే లక్ష్మీ ప్రణతి 8 సంవత్సరాలు చిన్నది.వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెద్దబ్బాయి పేరు అభి రామ్ కాగా చిన్నబ్బాయి పేరు భార్గవ్ రామ్.