హెచ్ 1 బీ వీసా దరఖాస్తుకు ముగిసిన గడువు.. లాటరీలో అదృష్టం ఎవరిదో..!!!

నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాల కోసం దరఖాస్తు గడువు ముగిసింది.ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.2021 సంవత్సరానికి గాను నిర్ణీత పరిమితికి సరిపడా దరఖాస్తులు స్వీకరించామని తెలిపింది.దరఖాస్తుదారులలో అర్హులైన వారిని కంప్యూటర్‌ లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని అధికారులు వెల్లడించారు.

 H-1b Visa: Uscis Says 65,000 Visa Cap Reached For 2021, H-1b Visa,uscis, H1b Vis-TeluguStop.com

తిరస్కరించబడిన దరఖాస్తుల సమాచారాన్ని సంబంధిత అభ్యర్ధులకు ఇప్పటికే తెలియచేశామని యూఎస్‌సీఐఎస్ తెలిపింది.

కాగా, ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.

వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

Telugu Donald Trump, Visa, Visa Uscis, Hb Visa, Uscis-Telugu NRI

హెచ్‌-1బీ వీసాల జారీలో దశాబ్ధాలుగా అమలు చేస్తున్న కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్ధతికి స్వస్తి పలుకుతూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక సంస్కరణలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.గరిష్ఠ వేతన స్థాయి, నైపుణ్యం ఆధారంగా వీసాలు ఇచ్చేలా కీలక సవరణ చేశారు.దీనికి అనుగుణంగా హెచ్‌-1 బీ ఎంపికలో లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐసీ) జనవరి 7న తుది ప్రకటన కూడా చేసింది.

దీని ప్రకారం మార్చి 9 నుంచి కొత్త ఎంపిక విధానం అమల్లోకి రావాల్సి ఉంది.

అయితే కొత్త విధానానికి అనుగుణంగా హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఎంపిక ప్రక్రియలో మార్పులు చేయాల్సి ఉన్నందున కాస్త సమయం పట్టే అవకాశం వుంది.

అందువల్ల నూతన విధానాన్ని డిసెంబరు 31 వరకు వాయిదా వేస్తున్నట్లు బైడెన్ యంత్రాంగం తెలిపిన సంగతి విదితమే.అప్పటివరకు పాత లాటరీ విధానాన్నే కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube