నేటి కాలంలో చాలా మంది యువతులు హీరోయిన్ కావాలని ఎన్నో కలలు కంటున్నారు.ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకొని వెండి తెరకు పరిచయం అవుతున్న నటీనటులు ఎందరో ఉన్నారు.
అయితే అప్పట్లో వెండితెరపై హీరోయిన్లుగా మెరిసిన వారిలో చాలామంది తమ కుటుంబ సభ్యుల చేత బలవంతంగా సినిమా రంగం లోకి నెట్టివేయబడినవారేనట.మరి కేవలం తల్లిదండ్రుల కోసమే డబ్బులు సంపాదించే యంత్రాలుగా మారిన హీరోయిన్లు ఎవరో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
1.సంగీత
ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం సినిమాలో సూపర్ గా డైలాగ్ చెప్పి బాగా పాపులర్ అయిన నటీమణి సంగీత.పెళ్ళాం ఊరేళ్ళితే, ఖుషిఖుషిగా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.నా ఊపిరి సినిమాలో వడ్డే నవీన్ సరసన హీరోయిన్ గా నటించి వావ్ అనిపించారు.
అయితే 2019లో సంగీత పై తన తల్లి భానుమతి ఫిర్యాదు చేశారు.తనని ఇంట్లో నుంచి సంగీత గెంటివేసిందని ఆమె ఆరోపించారు.ఆ సమయంలో సంగీత మాట్లాడుతూ.తన తల్లి తనని చిన్నతనంలో ఎంతగా ఇబ్బంది పెట్టిందో చెప్పారు.13 ఏళ్ల వయసులోనే చదువు మన్పించి.బలవంతంగా సినిమాల్లో నటింపజేసారని.
బ్లాంక్ చెక్కులపై సంతకాలు ఎన్నో సార్లు పెట్టించారని.మద్యం, డ్రగ్స్ కి బానిసలైన తన సోదరుల కోసం తన తల్లి తనని ఎంతగానో హింసించిందని సంగీత చెప్పుకొచ్చారు.ఐతే ప్రస్తుతం సంగీత సింగర్ క్రిష్ ని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా తన వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
2.వనిత విజయ్ కుమార్
14 ఏళ్ల వయసులోనే తనని సినిమా ఇండస్ట్రీ లోకి నెట్టి తనని ఒక మనీ మిషన్ గా చూశారని వనిత విజయ్ కుమార్ కూడా వాపోయారు.తల్లి డ్రగ్స్ కి బానిస అయ్యిందని.తండ్రికి డబ్బు పిచ్చి అని.ఇంట్లో విచ్చలవిడిగా తప్పులు జరిగిపోతూ ఉండేవని.చిన్న వయసులో హీరోయిన్ గా ఉండలేక నాలుగు సినిమాలకే ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నానని వనిత విజయకుమార్ మీడియా ముందు చెప్పి షాకిచ్చారు.ఇప్పటికీ తన బాల్యం తనకొక చేదు జ్ఞాపకం అని ఆమె చెబుతారు
3.కాంచన
అలనాటి నటీమణి కాంచన కూడా తల్లిదండ్రుల కారణంగా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాల్సి వచ్చింది.తన కూతురి ద్వారా డబ్బులు సంపాదించి ఆస్తులన్నీ తమ పేరిట మార్చుకోవాలని కాంచన తల్లిదండ్రులు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారట.దీనితో కాంచన ఇంట్లో నుంచి పారిపోయి తరువాత కోర్టుల చుట్టూ తిరిగి తన ఆస్తులను మళ్ళీ దక్కించుకున్నారట.ఆపై ఆమె తన ఆస్తులను తిరుపతి దేవస్థానానికి రాసి ఇచ్చేశారు.
4.అంజలి
జర్నీ ఫేమ్ అంజలి కూడా తన పిన తల్లి కారణం గా చదువుకుంటున్న టైమ్ లోనే సినిమాల్లోకి వచ్చారు.అయితే ఆమె సంపాదించిన డబ్బులన్నీ కూడా తన పినతల్లే వాడుకున్నారు.పెద్దయిన తరువాత అంజలి పోలీస్ స్టేషన్ ని కూడా ఆశ్రయించారు.ఆపై తన పినతల్లి నుంచి దూరంగా ఉంటున్నారు.