రేవంత్ పిటిషన్ కొట్టివేసిన ఏ‌సి‌బి న్యాయస్థానం ! కారణం ఏమిటంటే ?

తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి టి‌డి‌పి పార్టీలో ఉన్నపుడు ఆయన పై ఓటు కు నోటు కేసు నమోదు అయింది.ఈ విషయం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించిది.

 Acb Court Dismis The Revanth Reddy Petition, Revanth Reddy Petition, Acb Court,-TeluguStop.com

టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలనే నన్ను ఇందులో ఇరికించిందని ఆరోపించాడు.టి‌డి‌పి నేత చంద్రబాబు నాయుడు కూడా ఇందులో పాత్ర ఉందని టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది.

రేవంత్ రెడ్డి మాత్రం ఏ1 గా ఉన్నాడు. ఓటు కు నోటు కేసు పై రేవంత్ రెడ్డి ఇది ఏ‌సి‌బి పరిధిలోకి రాదు ఎన్నికల పరిధిలోకి వస్తుంది అంటూ పిటిషన్ ధాఖలు చేశాడు.

నేడు ఏ‌సి‌బి న్యాయస్థానం రేవంత్ పిటిషన్ పై విచారణ చేపట్టింది.ఈ కేసు ఎన్నికల పరిధిలోకి రాదు.ఏ‌సి‌బి పరిధిలోకి వస్తుందని చెబుతూ రేవంత్ వేసిన పిటిషన్ ను కొట్టేసింది.తదుపరి కేసు విచారణ ఫిబ్రవరి 8న జరగనున్నది.

ఆరోజు ఓటు కు నోటు కేసులో ఎంత మందిపై అయితే కేసు నమోదు అయ్యిందో అందరు హాజరు కావాలని కోరింది.ఈ విషయంపై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడో చూడాలి.

తెలంగాణ కాంగ్రెస్ నుండి టి‌పి‌సి‌సి చీఫ్ పదవి రేస్ లో ఉన్న రేవంత్ కు ఓటు కు నోటు కేసు పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube