సంతానం ఉంటేనే దాంపత్య జీవితం పరిపూర్ణం అవుతుంది.అందుకే వివాహం అయిన ఏ దంపతులైనా తమకు పిల్లలు పుట్టాలని కోరుకుంటారు.
కానీ, నేటి కాలంలో ఎందరో దంపతులు సంతాన సాఫల్యం ఎదుర్కొంటూ.మానసికంగా కృంగిపోతున్నారు.
ఎన్ని హాస్పటళ్లు తిరిగినా, అనేక మందులు వాడినా సంతానం కలగకుంటే.వారి బాధ వర్ణణాతీతమే.
అయితే పెళ్లై ఏళ్లు గడుస్తున్నా.పిల్లలు కలగకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
వాటిలో కొన్ని అతి ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి.
నేటి ఆధునిక కాలంలో చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుంది.అయితే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కూడా ఒత్తిడి ఒక కారణం.
ఒత్తిడి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది.దాంతో రిప్రొడక్టివ్ హార్మోన్స్ మీద పడి.
చివరకు సంతానోత్పత్తి సామర్ధ్యం దెబ్బ తింటుంది.అందువల్ల, ఒత్తిడికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.
అలాగే స్మోకింగ్ మరియు ఆల్కహాల్ అలవాట్లు కూడా సంతానం కలగకపోవడానికి కారణంగా చెప్పొచ్చు.
స్మోకింగ్ మరియు ఆల్కహాల్ వల్ల.మగవారిలో వీర్య నాణ్యతపై ప్రభావం పడగా.ఆడవారిలో అండాలు నశించిపోతాయి.
సో.సంతానం కావాలంటే దంపతులిద్దరు ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.ఇక పిల్లలు పుట్టడం, పుట్టకపోవడం బరువు కూడా ఆధారపడి ఉంటుంది.వాస్తవానికి ఎక్కువ బరువు ఉన్నా, తక్కువ బరువు ఉన్నా హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతాయి.దాంతో సంతాన సమస్యలు ఏర్పడతాయి.కాబట్టి, ఎప్పుడూ ఎత్తుకు సరిపడా బరువు ఉండాలి.
అలాగే రక్త హీనత సమస్య ఉన్న కూడా సంతానలేమిని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఐరన్ లోపం వల్ల రక్త హీనత సమస్య ఏర్పడుతుంది.దాంటో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.కాబట్టి, సంతానం కావాలనుకుంటే.
రక్త హీనత లేకుండా చూసుకోండి.ఇక గాలి బుడగలు కూడా సంతాలేమికి ఇటీవల కాలంలో ప్రధాన కారణంగా మారింది.
అండాశయం పైన, గర్భాశయం, పేగు వెలుపలి భాగాల వద్ద గాలి బుడగలు ఏర్పడతాయి.ఇవి ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి.