వ్యాక్సిన్ తీసుకున్న భారత సంతతి మిస్ ఇంగ్లాండ్.. సేఫ్ అంటూ కామెంట్..!!

కరోనాను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.టీకా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన జనాలు.

 Indian-origin Miss England Gets Covid Vaccine, Endorses Its Safety, Miss England-TeluguStop.com

వ్యాక్సిన్ డోస్ తీసుకోవడానికి మాత్రం జంకుతున్నారు.ఆ దేశం.

ఈ దేశం అని లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఇదే రకమైన పరిస్ధితి.ప్రజల్లో అపోహలు, అనుమానాలను తొలగించేందుకు దేశాధినేతలు, పలువురు సెలబ్రిటీలు పబ్లిక్‌గా వ్యాక్సిన్ తీసుకున్నారు.

తాజాగా భారత సంతతికి చెందిన మిస్ ఇంగ్లాండ్ భాషా ముఖర్జీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.ప్రజలు టీకా గురించి అనవసర భయాందోళనలు మానుకోవాలని.వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైనదని భాషా చెప్పారు.
25 ఏళ్ల ఈ అందాల రాణి గతేడాది ఏప్రిల్ నుంచి లింకన్‌షైర్‌లోని పిల్‌గ్రిమ్ హాస్పిటల్, తూర్పు ఇంగ్లాండ్‌లోని రాయల్ డెర్బీ ఆసుపత్రుల్లో వైద్యురాలిగా పనిచేస్తున్నారు.బ్రిటీష్ ఇండియన్ కమ్యూనిటీ హెల్త్ కేర్ అంబాసిడర్‌గా కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.తాను బీఏఎంఈ (బ్లాక్, ఆసియా, మైనారిటీ జాతి) వ్యక్తిగా గర్విస్తున్నానని.ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేందుకు కోట్లాదిమంది వెయిటింగ్ లైన్‌లో వున్న సమయంలో తనకు టీకా దొరికినందుకు ఎంతో అదృష్టవంతురాలినని భాషా చెప్పారు.

యూకేలో ఎన్‌హెచ్ఎస్ టీకా కార్యక్రమంలో భాగంగా ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను 70 ఏళ్లకు పైబడిన వ్యక్తులకు, ఫ్రంట్ లైన్ కరోనా వారియర్స్‌కు అందజేస్తున్నారు.

వైద్యురాలిగా పనిచేయడంతో పాటు భాషా.మిస్ ఇంగ్లాండ్ పోటీలలోనూ పాల్గొంటున్నారు.అలాగే పర్యావరణ హితమైన స్త్రీలకు సంబంధించిన బ్రాండ్ ప్లాస్ట్ ఫ్రీ ప్యాడ్‌లకు కూడా అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.కాగా, యూకేలో నిమిషానికి 200 డోసుల చొప్పున టీకాలు వేస్తున్నట్లు ఎన్‌హెచ్ఎస్ తెలిపింది.

గత నెలలో టీకా పంపిణీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 4 మిలియన్లకు పైగా ప్రజలకు టీకాలు వేశారు.

Telugu Corona Vaccine, Covid, Endorses Safety, Indianorigin, Englanddr, Nhsvacci

వృత్తి రీత్యా డాక్టర్ అయిన భాషా ముఖర్జీ 2019 ఆగస్టులో మిస్ ఇంగ్లండ్‌ గా ఎంపికై కొంతకాలం వైద్య వృత్తికి విరామం ఇచ్చి సేవా కార్యక్రమాలతో పాటు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.అందుకోసం ఇప్పటికే పలు దేశాల్లో సామాజిక కార్యక్రమాలకు హాజరైంది.2020 ఏప్రిల్‌ నెలలో నాలుగు వారాల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్లాన్ చేసుకుని ఇండియాకు వచ్చింది.కానీ, ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించింది.యూకేలో పరిస్థితి దారుణంగా ఉండడంతో పిల్‌గ్రిమ్‌ ఆసుపత్రిలోని బాషా ముఖర్జీ సహచరుల నుంచి ఆమెకు సందేశాలు వచ్చాయి.

అక్కడ పరిస్థితి ఎలా ఉందో వాళ్ల ద్వారా తెలుసుకుంది.ఈ సమయంలో వైద్యురాలిగా ప్రజలకు తన అవసరం ఉందని గ్రహించిన ముఖర్జీ వెంటనే యూకేకు తిరుగు పయనమై పలువురికి ఆదర్శంగా నిలిచారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube