డ్రైవింగ్ లైసెన్స్ పై ఫోకస్ పెట్టిన రామ్ చరణ్

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలలో నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత ఎవరితో అనేది ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.

 Ram Charan Plan To Driving Licence Movie Remake, Tollywood, Mega Hero, Rrr Movie-TeluguStop.com

అయితే ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని మళ్ళీ కొత్త సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక రామ్ చరణ్ కోసం చాలా మంది దర్శకులు లైన్ లో ఉన్నారు.

ఇప్పటికే కథలు కూడా చెప్పారు.అంధులో తెలుగు దర్శకులతో పాటు, లోకేష్ కనగరాజ్ లాంటి తమిళ్ దర్శకుడు కూడా ఉన్నారు.

అతనితోనే నెక్స్ట్ సినిమా ఉండే అవకాశం ఉందనే టాక్ ఉంది.ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఇప్పటికే మలయాళీ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కి సంబందించిన రీమేక్ హక్కులు కొనుగోలు చేశాడు.

ఈ సినిమా మల్టీ స్టారర్ కథాంశంతో తెరకెక్కి అక్కడ సూపర్ హిట్ అయ్యింది.పృథ్వీరాజ్ హీరోగా నటించాడు.

ఈ సినిమాని రీమేక్ చేయాలని రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.అది కూడా తన ప్రొడక్షన్ లోనే తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.

Telugu Acharya, Licence, Pawan Kalyan, Ram Charan, Rrr, Tollywood-Movie

ఇదిలా ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయ్ రామ్ చరణ్ కలిసి నటించే అవకాశం ఉందని గట్టిగా వినిపిస్తుంది.అయితే ఇప్పటికే వరుసగా ఈ ఏడాది నాలుగు సినిమాలని బ్యాక్ టూ బ్యాక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కోసం డేట్స్ కేటాయిస్తాడా అనేది చూడాలి.ఈ పవన్ కళ్యాణ్ ఎన్ని సినిమాలు చేసిన 2021 వరకు మాత్రమే చేయగలడు.తరువాత మళ్ళీ ఎన్నికలు సమీపిస్తాయి కాబట్టి పొలిటికల్ గా యాక్టివ్ అవ్వాలి.ఈ లోపు ఫైనాన్సియల్ గా కొంత బలంగా తయారవ్వాలి కాబట్టి పవన్ సినిమాలు చేస్తున్నారు.ఒక వేళ రామ్ చరణ్ కోసం డ్రైవింగ్ లైసెన్స్ సినిమా చేయడానికి ఒప్పుకుంటే మాత్రం అది మరో క్రేజీ ప్రాజెక్ట్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube