2000 కాలంలోనే ఎంతో నటులు మంచి మంచి పాత్రలలో నటించి ఉంటారు.కానీ ఎందుకో మరి.
అదృష్టం లేకనో ఇంకేదైనానో కానీ అప్పట్లో వారికీ ఆ రేంజ్ లో ఫెమ్ రాలేదు.కానీ ఇప్పుడు మాత్రం వారు ఒక స్టార్ యాంకర్, స్టార్ యాక్ట్రస్ రేంజ్ లో ఉన్నారు.
ఇక అలానే అప్పట్లో రాఖీ సినిమాలో స్టార్ హీరో ఎన్టీఆర్ చెల్లిగా నటించిన మంజుషా ఇప్పుడు పెద్ద యాంకర్.త్వరలోనే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు ఇండస్ట్రీలో గుస గుసలు కూడా వినిపిస్తున్నాయ్.2006లో విడుదలైన రాఖి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పాల్సిన పని లేదు.ఎంతో ప్రేమగా కంటికి రెప్పలా పెంచుకున్న చెల్లికి పెళ్లి చేసి పంపిస్తే వరకట్నం కోసం అత్తవారు రాచిరంపాన పెట్టి చంపేస్తారు.
అన్నగా ఉన్న ఎన్టీఆర్ ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగిన నేను ఉన్న అంటూ ఆడపిల్లలను రక్షిస్తూ మగమృగాలను పెట్రోల్ పోసి కాల్చి చంపుతాడు.ఆ సినిమాలో ఎన్టీఆర్ నటించిన తీరు చూస్తే ఎవరైనా ఫ్యాన్స్ అవ్వాల్సిందే.
నిజానికి ఆ సినిమాలో జరిగిన ఘటనలు అన్ని స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల ఇప్పుడు ఒకొక్కటి బయటపడుతున్నాయ్.
ఇక ఈ సినిమాకు ఇంచుమించు పోలికతో ఉన్న సినిమా టెంపర్.ఇది కూడా నిర్భయ ఘటనలు లాంటివాటిని బేస్ చేసుకొని ఎంతో ఎమోషనల్ గా తీసిన సినిమా.అందుకే ఈ సినిమా రీమేక్ అవ్వడమే కాకుండా సూపర్ హిట్ అయ్యింది.
ఎన్టీఆర్ ఎప్పుడు కూడా మహిళలకు సపోర్ట్ చేస్తాడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ చెల్లిగా నటించిన మంజూష ప్రస్తుతం మంచి యాంకర్.
అప్పట్లో ఈమెకు పెద్దగా ఫెమ్ రాకపోయిన త్వరలోనే జబర్దస్త్ పై కనిపిస్తుందని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.