చాలామంది పులిని చూడడానికే భయపడతారు అలాంటిది పులి చేతికి దొరికిన ఇంకా ఏమైనా ఉందా చెప్పండి.పులి పంజా విసిరితే అవతల జంతువు అయినా సరే, మనిషి అయినా సరే బతకడం అసాధ్యం.
అంతేకాదు పెద్దల కాలం నాటి నుండి “పులి గోకడం.అయ్యా బతకడం.” అనే నానుడి కూడా ప్రచారం ఉంది.అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం తనకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబోలు అందుకే పులి పంజా కు దొరికిన కానీ ఆ పులి ఆ వ్యక్తిని ప్రాణాలతో విడిచి పెట్టింది.
దీంతో ఆ వ్యక్తి బతుకుజీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
తాజాగా భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో తేజ్ పూర్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది.ఆ ప్రాంతంలోని అడవుల నుంచి పొలాల్లోకి వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ అక్కడ ఉన్న స్థానికులను భయాందోళనలకు గురి చేస్తుంది.
తాజాగా అడవుల నుంచి పొలాల్లోకి వచ్చిన ఈ పులి మనుషులపై దాడి చేయడానికి ప్రయత్నించడంతో కొందరు వ్యక్తులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది.తాజాగా ఓ యువకుడి వెంట పులి తరమడమే కాకుండా అతనిపై పంజా విసిరింది.
అయితే పులి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ వ్యక్తి ఓ గోతిలోకి దూకేశాడు.ఆ వ్యక్తితో పాటు పులి కూడా అమాంతం గోతిలోకి దూకేసింది.
అయితే అదృష్టం కొద్దీ వెంటనే ఆ పులి వెనక్కి వచ్చేసి అక్కడ ఉన్న ఇసుక తిన్నెలపై నుంచి సమీపంలో ఉన్న చెట్లపొదల లోకి వెళ్ళిపోయి మాయమైపోయింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సంఘటనలో మొత్తం ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.