బిగ్ బాస్ లోకి సుమ వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ.. అవాక్కైన కంటెస్టెంట్లు..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బిగ్ బాస్ షోలోకి కుమార్ సాయి, అవినాష్, స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

 Anchor Suma Wild Card Entry In Bigg Boss Show,suma,anchor Suma,bigboss-TeluguStop.com

ఈ ముగ్గురిలో కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు.అయితే ఎవరూ ఊహించని విధంగా స్టార్ యాంకర్ సుమ బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్టు ప్రోమో విడుదలైంది.

దాదాపు 16 సంవత్సరాల నుంచి బుల్లితెరపై సుమ నంబర్ 1 యాంకర్ గా కొనసాగుతున్నారు.ఎంతో మంది యాంకర్లు అవకాశాలు లేక కనుమరుగైనా సుమ మాత్రం వరుస షోలతో బిజీగానే ఉన్నారు.

ఈరోజు స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున సుమను “వైల్డ్ కార్డ్ ఇవ్వడానికి ఎలా ఒప్పుకున్నావ్.? ” అని అడగగా “పాండమిక్ చాలా మార్పులు తీసుకొచ్చింద” అని హౌస్ లోని కంటెస్టెంట్ల పాలిట వైల్డ్ కార్డ్ అవ్వబోతున్నానని సుమ చెప్పారు.

ఆ తరువాత అవినాష్ సుమను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పగా నాగార్జున తాను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నానని చెప్పడంతో సుమ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ పెట్టారు.ఆ తరువాత సుమ పంచ్ లతో, సెటైర్లతో షోలో సందడి చేశారు.

ఇది ప్రోమో మాత్రమేనని లోపలికొస్తే సినిమా ఉంటుందని చెప్పి సుమ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

అయితే సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కేవలం వీకెండ్ ఎపిసోడ్ పై అంచనాలు పెంచడానికి మాత్రమే సుమ ఎంట్రీ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.గతంలో కొందరు సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరి సుమ నిజంగా హౌస్ లో ఉంటారో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube