వైరల్ వీడియో: నాకు ఇంతే వచ్చు అంటున్న ఒబామా..!

అమెరికా దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన బరాక్ ఒబామా కు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇకపోతే ఈ వీడియోలో బరాక్ ఒబామా ప్రతిభను చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.

 Obama Says This Is What I Can Do Barack Obama, Bidan, America, Usa, Elections S-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి సమాచారంలోకి వెళితే.అమెరికా అధ్యక్ష పదవికి మంగళవారం నుండి జరగనున్న ఎన్నికల కారణంగా ఆయన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి అలాగే మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ కు మద్దతుగా దేశం మొత్తం ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇందుకోసం ఆయన అమెరికా దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ బిడెన్ తరఫున ప్రచారం కొనసాగిస్తున్నారు.ఇందుకోసం తాజాగా బారక్ ఒబామా అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో పర్యటించారు.ఇందులో భాగంగా ఓ పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడ ప్లే గ్రౌండ్ లో ఉన్న బాస్క్‌ట్ బాల్ కోర్టు దగ్గరికి వెళ్లి బాల్ ను నేరుగా నెట్ లో వేసేశాడు.

ఇలా చేయడంతో అక్కడున్న వారు అందరూ ఆశ్చర్యపోయారు.

దీంతో ఆయన వెంటనే నాకు ఇంతే వచ్చు అంటూ అక్కడి నుంచి తప్పుకున్నారు.అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒబామా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు.

ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపించారు.అయినను పెద్ద ఎత్తున ఆటతీరును ప్రశంసిస్తున్నారు నెటిజన్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube