టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా సక్సెస్ అయిన పంజాబీ భామ తాప్సి తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ లేడీ ఒరియాంటెడ్ కథలతో వరుస సక్సెస్ లు అందుకుంటూ సత్తా చాటుతుంది.కమర్షియల్ చిత్రాల జోలికి వెళ్లకుండా కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ వస్తుంది.
కమర్షియల చిత్రాల జోలికి కూడా వెళ్లే ప్రయత్నం చేయనని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తాప్సి తెగేసి చెప్పేసింది.ఇదిలా ఉంటే ఇప్పుడు మహిళా ప్రధాన చిత్రాలకు తాప్సి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.
అదే సమయంలో ఒకప్పటిలో సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయడం లేదు.ఇక్కడ కూడా కథ ప్రాధాన్యంగా ఉన్న సినిమాలు మాత్రమే చేస్తానని, అలాంటి కథలతో తన దగ్గరకి రావాలని క్లారిటీ ఇచ్చింది.
ఈ నేపధ్యంలో ఆమె చాలా గ్యాప్ తర్వాత కోలీవుడ్ లో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విజయ్ సేతుపతితో కలిసి కొత్త దర్శకుడు దీపక్ సుందర్ రాజన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది.
గత కొన్ని రోజులుగా జైపూర్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.ఈ విషయాన్ని తాప్సీ తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది.
కొన్ని నెలల క్రితం ఇదొక సుదూరమైన కలలా అనిపించింది.ఇప్పుడు అది పూర్తి కావడం చాలా ఆనందంగా ఉంది.
అనబెల్లెకు వీడ్కోలు సమయం.త్వరలో థియేటర్లలో కలుద్దాం అంటూ ఆఖరి రోజు సెట్లో దిగిన ఓ ఫొటోని అభిమానులతో పంచుకుంది.
పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న ఈచిత్రంలో తాప్సీతోపాటు విజరుసేతుపతి కూడా ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.ఇక ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మరి చాలా గ్యాప్ తర్వాత సౌత్ లో తాప్సి చేస్తున్న ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి.