యువతి, యువకులు ఎదుర్కొనే ప్రధాన చర్మ సమస్యల్లో మొటిమల సమస్య ముందుంటుంది.మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి.
అయితే చర్మంలో ఉన్న నూనె గ్రంధుల నుండి విడుదలయ్యే అధిక చమురు స్రావమే మొటిమలు ఏర్పడడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక మొటిమలు వచ్చాయంటే.
అవి పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.ఏవేవో ప్రోడెక్ట్స్ వాడుతుంటారు.
కానీ, ఫలితం లేక బాధపడుతుంటారు.అయితే ఇంట్లో దొరికే మెంతిపిండితో మొటిమలకు సులువుగా చెక్ పెట్టవచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని మెంతిపిండి తీసుకోవాలి.
అందులో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్తై చేసి.
బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చిని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానిరికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
అదే సమయంలో ముఖం ఫ్రెష్‌గా, మృదువుగా మారుతుంది.
రెండొవది.
ఒక బౌల్‌లో మెంతిపిండి తీసుకుని.అందులో కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పది లేదా ఇరవై నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.అలాగే చర్మం మృదువుగా కూడా మారుతుంది.
మూడొవది.ఒక బౌల్‌లో మెంతిపిండి తీసుకుని.అందులో నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.
అర గంట పాటు ఆరనివ్వాలి.ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా తరచూ చేయడం వల్ల కూడా మొటిమలు తగ్గడంతో పాటు ముఖం మంచి రంగు సంతరించుకుంటుంది.