అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్ధుల మధ్య వాడి వేడిగా మాటల తూటాలు పేలుతున్నాయి.అమెరికాలో ఎన్నికల ముందు ఒక ఆనవాయితీ ఉంటుంది.
ఇద్దరు ముఖాముఖిగా కొన్ని విషయాలపై చర్చలు జరుపుకుంటూ తాము ఏమి చేస్తాము, ఎలాంటి పాలన అందిస్తాము అనే విషయాలు పంచుకుంటారు.అయితే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచీ అధ్యక్ష బరిలో నిలిచిన బిడెన్ ఇద్దరూ పాల్గొన్న డిబేట్ కార్యక్రమం అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త డిబేట్ గా అభివర్ణిస్తున్నారు పరిశీలకులు.
నిన్నటి రోజున ట్రంప్, బిడెన్ ల మధ్య జరిగిన డిబేట్ ని ఓ చిన్నపాటి యుద్ధంగా అభివర్ణించింది స్థానిక మీడియా.సహజంగా ట్రంప్ కి దూకుడు స్వభావం, నోటికి వచ్చినట్టు మాట్లాడటం అలవాటే కానీ ఈ డిబేట్ లో మాత్రం ట్రంప్ ఉగ్ర రూపం చూపించారు ఇక ఎప్పుడు శాంతంగా ఉంటూ సమాధానాలు చెప్పే బిడెన్ కూడా తన హద్దులు దాటేశారు.
వర్ణ వివక్ష, పారిస్ ఒప్పందం, ఎన్నికల్లో బ్యాలెట్ విధానం నల్లజతీయులపై దాడులు, ఆర్ధిక భారం ఇలా ప్రతీ ఒక్క అంశంపై వాడి వేడిగా చర్చలు జరిగాయి.బిడెన్ ఎక్కువగా కరోనా విషయంపై ట్రంప్ ని నిలదీస్తూ వచ్చారు, ట్రంప్ కూడా అందుకు ధీటుగా సమాధానాలు ఇచ్చారు.ఇదిలాఉంటే
ఆసక్తిగా సాగుతున్న ఇద్దరి మధ్య డిబేట్ ఓ స్థాయిలో హద్దులు దాటేసింది.ట్రంప్ తనదైన శైలిలో హావభావాలు పలికిస్తూ నువ్వో మొద్దు, నోరు మూసుకో, చదువులో మొద్దు అబద్దాలు చెప్తావు, జోకర్ అంటూ బిడెన్ పై ఊగిపోయారు.
ఇక బిడెన్ కూడా ఏ మాత్రం తగ్గలేదు జాత్యహంకారిగా ఉన్న నువ్వు అధ్యక్షుడిగా పనికిరావు, నువ్వో జోకర్ , లోఫర్, పుతిన్ చేతిలో నువ్వో కుక్క పిల్ల అంటూ రెచ్చిపోయారు.