ఆవిరి పట్టడం ద్వారా ఎలాంటి ఉపయోగమో తెలుసా...?

సాధారణంగా మనకు ఏదైనా శ్వాస కోశ వ్యాధులకు సంబంధించినప్పుడు మాత్రమే ఆవిరి పడతాము.ముఖ్యంగా మనకు జలుబు చేసిన సమయంలో ఆవిరిని పట్టుకుంటాము.

 Amazing Health Benefits Of Steaming Details, Steaming, Pimples, Skin Care, Healt-TeluguStop.com

ఇక మరికొందరు చర్మ సంరక్షణ కోసం కూడా ఈ ఆవిరిని తరచూ ఉపయోగిస్తుంటారు.అలాగే ఫేషియల్ సమయంలో ఈ ఆవిరిని ప్రధానంగా ఉపయోగిస్తారు.

ఇలా మొహానికి ఆవిరిని అప్లై చేయడం ద్వారా చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని ద్వారా అనేక లాభాలను పొందవచ్చు.

ముఖ్యంగా ఆవిరి పట్టడం ద్వారా చర్మంమీద మూసుకుపోయిన చర్మ గ్రంధులను తెరిచే విధంగా చేయవచ్చు.ఇలా చేయడం ద్వారా చర్మం లోపల పేరుకుపోయిన మురికిని బయటకు తేవడానికి బాగా ఉపయోగపడుతుంది.

చర్మం మీద ఉండే మృత కణాలు తొలిగి ఆ ప్రాంతంలో చర్మం పూర్తి శుభ్రంగా ఏర్పడి ముఖానికి సంబంధించిన రక్తప్రసరణ బాగా జరగడానికి ఈ ఆవిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇలా ఆవిరి క్రమంగా పెట్టుకోవడం ద్వారా మొహం పై ఉండే వైట్ హెడ్స్, అలాగే బ్లాక్ హెడ్స్ కూడా చాలా తగ్గడానికి ఇది ఎంతగానో సహకరిస్తుంది.

ముఖ్యంగా మొటిమలు ఎక్కువగా ఉన్నవారు వారానికి మూడు లేదా నాలుగు సార్లు ఆవిరి పట్టుకోవడం ద్వారా మొటిమలు కంట్రోల్ లో ఉంటాయి.మొటిమలు ఉన్నవారు ఇలా ఆవిరి పట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఐస్ క్యూబ్స్ తో వాటిపై రుద్దుకుంటే మొటిమలకు సంబంధించిన సమస్యలు అతి త్వరగా తొలగిపోతాయి.

Telugu Benefits, Black Heades, Headache, Tips, Lavender Oil, Peppermint Oil, Pim

ఈ ఆవిరి పట్టడం ద్వారా తలనొప్పితో బాధపడేవారు కూడా ఉపశమనం పొందవచ్చు.ఇలా తలనొప్పితో బాధపడేవారు ముందుగా ఆవిరి పెట్టే నీళ్లలో లావెండర్ నూనె కాస్త కలుపుకొని అది ఆవిరి పెట్టుకుంటే తలనొప్పి నుండి చాలా వరకు ఉపశమనం చాలా త్వరగా పొందవచ్చు.అంతేకాకుండా అలసట, ఒత్తిడి నుండి కూడా ఈ ఆవిరి పట్టడం ద్వారా మనం ఉపశమనం పొందవచ్చు.సైనస్ సమస్య ఉన్న వారికి కూడా ఈ ఆవిరి పట్టడం ఎంతగానో ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారు ఆవిరి పట్టే నీటిలో పిప్ఫర్మింట్ ఆయిల్ కలిపి ఆవిరి పెట్టుకుంటే జిడ్డు చర్మం పై బాగా ప్రభావం చూపుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube