తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కాకపోతే అజీర్ణం, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంటుంది.అంతేకాక కడుపునొప్పి, కడుపులో మంట వంటివి కూడా రావటంతో చాలా అసౌకరంగా ఉంటుంది.
సరైన వేళలో భోజనం చేయకపోవటం, మసాలా పదార్ధాలు ఎక్కువగా తినటం, జంక్ ఆహారాలను తినటం వలన ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది.ఈ సమస్య నుండి బయట పడటానికి అద్భుతమైన మరియు సమర్ధవంతమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి.
వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.ఒక కప్పు నీటిలో అంగుళం అల్లం ముక్కను వేసి బాగా మరిగించాలి.మరిగిన నీటిని వడకట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి.సమస్య తీవ్రతను బట్టి రోజులో రెండు నుంచి మూడు సార్లు త్రాగితే జీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు.
ఒక గ్లాస్ నీటిలో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని త్రాగితే మంచి ఫలితం కలుగుతుంది.
అలాగే మార్కెట్ లో దొరికే ENO ని కూడా ఉపయోగించవచ్చు.ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ సోంపు గింజలను వేసి బాగా మరిగించాలి.ఈ నీటిని వడకట్టి కాస్త వేడిగా ఉన్నప్పుడే త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని భోజనానికి అరగంట ముందు త్రాగితే తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి ఎటువంటి జీర్ణ సమస్యలు రావు.