భారత్ నుంచీ ఎంతో మంది ఉన్నత చదువుల కోసమో,లేదా ఉన్నతమైన ఉద్యోగాలు , వ్యాపారాల కోసమో వివిధ దేశాలకి వలస వెళ్తూ ఉంటారు.అలా భారతీయులు వెలస వెళ్లి ఆర్ధికంగా స్థిరపడి అక్కడే ఆయా దేశాలలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న దేశాలలో అమెరికా ప్రధమ స్థానంలో ఉంది.
ఆ తరువాత అరబ్ కంట్రీస్ రెండవ స్థానంలో ఉన్నాయి.అమెరికాలో భారతీయులు పలు రంగాలలో స్థిరపడటమే కాకుండా అక్కడి చట్ట సభలలో కూడా అమెరికన్స్ తో పోటీ పడుతూ ఉన్నత స్థానాలను అధిరోహించారు.
ఈ క్రమంలోనే ఎంతో మంది ఇండో అమెరికన్స్ ప్రజల మన్ననలు అందుకున్నారు.
అమెరికాలో భారతీయులలో అత్యధికంగా సిక్కు వర్గానికి అరుదైన గుర్తింపు ఉంటుంది.
సిక్కులని అమెరికన్స్ ఎంతగానో ఇష్టపడుతారు.ముఖ్యంగా సిక్కులు అమెరికా రక్షణ విభాగాలలో సేవలు అందిస్తూ ఉంటారు.
ఇదిలాఉంటే పోలీస్ శాఖలో సేవలు అందిస్తున్న ఓ సిక్కు యువకుడు ఊహించని విధంగా దుండగుల కాల్పులలో అసువులు బాశాడు.గతేడాది ఈ సంఘటన జరిగింది.
గత ఏడాది జరిగిన ఈ ఘటన అప్పట్లో అందరిని షాక్ కి గురించేసింది.
గత ఏడాది భారత సంతతికి చెందిన సందీప్ సింగ్ ధలీవాల్ అనే యువ సిక్కు పోలీస్ విదులల్లో ఉండగా దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో అతడి మృతి చెందగా అతడి సేవలని గుర్తించిన స్థానిక అధికారులు, రాజకీయ నేతలు అతడి పేరును హ్యుస్టన్ అని పోస్టాఫీస్ కి పెట్టారు.ఈ మేరకు ప్రజా ప్రతినిధుల సభ ఏకగ్రీవంగా ఆమోదం కూడా తెలిపింది.
ఇండో అమెరికన్ అయిన సిక్కు యువకుడి పేరుని పోస్టాఫీస్ కి పెట్టడంతో సిక్కు సంఘాలు స్థానిక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.