ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ పై పలు దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.తాజాగా సొరియాసిస్, రుమాటాయిడ్, ఆర్థరైటిస్ వంటి ఇన్ ఫ్లమేటరీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇమ్యూనిటీ పవర్ పెంచేందుకు ఇమ్యూనోసప్రెసంట్ ఔషధం మెరుగ్గా పని చేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఇమ్యూనోసప్రెసెంట్ ఔషధంతో కరోనాను చెక్ పెట్టవచ్చని అమెరికాలోని ‘హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్’కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇన్ ఫ్లమేటరీ వ్యాధులతో బాధ పడుతున్న వారిలో ఇమ్యూనోసప్రెసెంట్ మందును వాడే వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ సాధారణ ప్రజలతో పోలిస్తే వీరికి కరోనా ముప్పు తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ వ్యాధి బారిన పడిన వారిలో కేవలం జలుబు, దగ్గు, గొంతులో మంట వంటి సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు.హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ కు చెందిన పరిశోధకులు ఇమ్యూనోసప్రెసెంట్ ఔషధాన్ని వాడే 213 మందిపై పరిశోధనలు నిర్వహించారు.
సాధారణ కరోనా బాధితులతో పోలిస్తే.ఇన్ ఫ్లమేటరీ వ్యాధులతో బాధపడుతున్న కరోనా బాధితుల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అయితే మల్టీడ్రగ్ థెరఫీతో ఇమ్యూనోసప్రెసెంట్ ఔషధాన్ని ఒకటి కంటే ఎక్కువగా తీసుకుంటున్న వారిలో రోగ నిరోధక శక్తి భారీగా క్షీణిస్తుందని, వీరికి కరోనా ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.