భారతీయులు ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో వివిధ రంగాలలో స్థిరపడ్డారు.విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అనేక రంగాలలో మనదైన ముద్రవేస్తూ మన్ననలు అందుకుంటున్నారు.
మరికొందరు రాజకీయంగా ఉన్నత స్థానాలకి చేరుకుంటున్నారు.అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారత సంతతికి చెందిన కమలా హారీస్ ఎన్నికవడంతో ఎంతో మంది భారతీయులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఒక్క కమలా హారిస్ మాత్రమే కాదు పలు దేశాలలో భారతీయులు ఎంతో మంది ఆదేశ ఉన్నత పదవులని అలంకరిస్తున్నారు.ఈ క్రమంలోనే.
బ్రిటన్ లో హైదరాబాద్ కి చెందిన తెలుగు ఎన్నారైను కీలక పదవి వరించింది.బ్రిటన్ లో డిప్యుటీ లార్డ్ మేయర్ గా హైదరాబాద్ కి చెందిన డాక్టర్ కన్నెగంటి చంద్ర నియమింపబడ్డారు.
ఆ స్థాయి పదవిని ఓ తెలుగు వ్యక్తి దక్కించుకోవడం ఇదే మొదటి సారని అంటున్నారు బ్రిటన్ లోని ప్రవాస భారతీయులు.ప్రస్తుతం డాక్టర్ కన్నెగంటి 43 మంది సభ్యులతో కౌంటీలో కన్జర్వేటివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అంతేకాదు గోల్డెన్ హిల్ మరియు శాండీ ఫోర్డ్ కౌన్సిలర్ గా కూడా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు.
డాక్టర్ కన్నెగంటి జనరల్ ఫిజీషియన్ గా విశేష సేవలు అందిస్తున్నారు.
ఆయనకి భార్యా, ముగ్గురు పిల్లలు ఉన్నారు.బ్రిటన్ లో అతిపెద్ద నగరమైన స్టోక్ కి ఆయన 2006 లో వచ్చానని ఇక్కడ ఉండే జనాభాలో చాలామంది ఆసియన్స్ ఉన్నారని, అంతేకాదు ఇక్కడ పాకిస్తాన్ ప్రజలు ఉన్నా అందరం కలిసి మెలిసి ఉంటామని ఆయన అన్నారు.2002 లోనే హైదరబాద్ నుంచీ స్కాట్ లాండ్ వెళ్ళిన కన్నెగంటి పలు సేవా కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకి సుపరిచుతుడు అయ్యారు.