పబ్జీతో మరో యువకుడి బలి.. ఆలస్యంగా వెలుగులోకి !

దేశంలో కరోనా విజృంభణ కొసాగుతూ ఉండటంతో పిల్లలు అందరు ఇంటికే పరితమైయ్యారు.ఇంటి నుండి బయటికి వెళ్లకపోవడంతో ఆన్ లైన్ గేమ్స్ కి బానిసైయ్యారు.

 Pubg, Boy, Dead, Police-TeluguStop.com

ఆన్ లైన్ గేమ్స్ మాయలో పడిన యువత అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు.ఇక చాల మంది యువత ఆన్ లైన్ గేమ్స్ లో బెట్టింగ్స్ పెట్టి అప్పుల పాలవుతున్నారు.

అంతేకాక మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.ఇక పబ్జీ గేమ్ అందుబాటులోకి వచ్చిన దగ్గరి నుండి ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు.

తాజాగా పబ్జీ గేమ్‌కు బానిసై బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.నగరంలో రెవెన్యూ కాలనీలో తల్లిదండ్రులు నరసింహారెడ్డి, హిమాజారాణి నివాసం ఉంటున్నారు.చెన్నైలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న కిరణ్ కుమార్ కరోనా కారణంగా ఇంటికి వచ్చాడు.అతడు కాలేజ్ లో చదువుతున్న సమయంలో పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పబ్జీ గేమ్ ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.దీంతో మనస్థాపానికి గురైన యువకుడు ఇంటిపైన ఉన్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కిరణ్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో ఇంటిపై నుండి దుర్వాసన రావడంతో తల్లిదండ్రులు గది తలుపులు పగలగొట్టి చూడగా కిరణ్ విగతజీవిగా పడి ఉన్నాడు.

విగతజీవిగా కొడుకుని చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube