ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchagam):
సూర్యోదయం: ఉదయం 5:49 సూర్యాస్తమయం: సాయంత్రం 6:08 రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు అమృత ఘడియలు: రా.7.45 నుంచి 9.31 వరకు దుర్ముహూర్తం: సా.4.29 నుంచి 5.18 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Raasi Palalu):
మేషం:
ఈరోజు ఇంట్లోవారికి ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఎవరి వద్ద అయినా అప్పు తీసుకొని ఉంటే వెంటనే ఇచ్చేయడం మంచిది.షాపింగ్ కి వెళ్లిన సమయంలో దుబారా ఖర్చు చెయ్యడం మానేస్తే మంచిది.ఆరోగ్యం కొరకు మంచి నిద్ర ఎంతో అవసరం.
వృషభం:
ఆర్థికపరంగా ఎలాంటి కష్టాలు ఉండవు.గ్రహాలు, నక్షత్రాల వల్ల గతంలో ఇచ్చిన అప్పు డబ్బులు, ప్రస్తుతం వ్యాపారాల్లో లాభాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది.పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
మిథునం:
ఈరోజు కొత్త విషయాలను తెలుసుకుంటారు.ఎంతో చురుకుగా ఆలోచిస్తారు.
కొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించే అవకాశం ఉంది.పవిత్రమైన వేడుకలు ఇంట్లో నిర్వహిస్తారు.బాధాకరమైన గతాన్ని మరిచి ఆనందంగా ఎంజాయ్ చేస్తారు.
కర్కాటకం:
ఎవరైనా వ్యాపారం చేస్తున్నాం అని అప్పు కావాలని వస్తే వారికి ఇవ్వకపోవడం మంచిది.ఇంటిపనులు కోసం సమయాన్ని కేటాయిస్తారు.ఈరోజు మీరు దేవస్థానాలు దర్శించటం, దానధర్మాలు చేయటం, ధ్యానం చేయటానికి ప్రయత్నిస్తారు.
సింహం:
ఏదైనా పని ప్రారంభించే ముందు పెద్దవారి వద్ద ఆశీర్వాదం తీసుకోవడం మంచిది.ఇతరుల అవసరాలు తీర్చేలా చూసుకోవడం మంచిది.
చిన్న చిన్న వివాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయ్.అవి జరగకుండా చూసుకోండి.మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చెయ్యడం మంచిది.
కన్య:
ఇతర దేశాలలో డబ్బుని పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడు పోయే అవకాశం ఉంది.దీని వల్ల మంచి లాభాలు పొందుతారు.స్నేహితుల నుంచి ఆహ్వానం అందుతుంది.ఈరోజు అంత ఎంతో ఆనందంగా ఉల్లాసంగా గడుపుతారు.
తులా:
ఈరోజు జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.మీ బాధను, ఆనందాన్ని మీ ప్రాణస్నేహితులతో పంచుకుంటారు.కొన్ని చికాకులు ఉంటాయి.ఉదయమే కొంచం సేపు ధ్యానం చేస్తే మంచి జరుగుతుంది.
వృశ్చికం:
చిన్న తరహా వ్యాపారాలు చేస్తున్న వారికి ఆర్ధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.వస్తువులు జాగ్రత్తగా ఉపయోగించకపోతే పాడవడం లేదా దొంగతనం జరిగే అవకాశం ఉంది.ఈరోజు మొక్కలను పెంచితే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.
ధనస్సు:
మీ విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు.ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ధనం అందే అవకాశం ఉంది.
సమస్యలకు తక్షణమే పరిష్కారం ఉంటుంది.ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది.
మకరం:
మీకు ఆర్ధికంగా మంచి లాభాలు అందిస్తాయి.ఎవరితో అయితే సన్నిహిత్యంగా ఉంటున్నారో వారితో గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈరోజు ఎన్నో పనులు చెయ్యాలి అనుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోతాయి.కోపాన్ని తగ్గించుకునేందుకు ధ్యానం చేస్తే మంచిది.
కుంభం:
ఖర్చు పెట్టె సమయంలో ఆలోచించి పెట్టండి.ఆర్ధికంగా నష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
మీ పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఈరోజు కుటుంబ వేడుకలకు, సంబరాలకు మంచి రోజు.
మీనం:
అనవసర ఖర్చులు పెట్టడం మంచిది కాదు.ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది.
ఈరోజు ఎంతో ఆనందంగా జీవిస్తారు.రోజంతా కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లోను గొడవలు జరిగే అవకాశం ఉంది.
నోరును అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.