హైదరాబాద్ లో కిడ్నాప్ కలకలం రేపింది.కొందరు కిడ్నాపర్లు ఓ మహిళను ఏకంగా ఇంట్లో నుంచే అపహరించారు.
గుట్టుచప్పుడు కాకుండా కిడ్నాప్ చేసి లాడ్జిలో నిర్భందించారు.లాడ్జిలో చిత్రహింసలు పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నల్గొండ జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన ఓ మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది.
భర్త ల్యాబ్ టెక్నీషియన్.అయితే రాయదుర్గం మణికొండకు చెందిన ఆవుల రాజేశ్ అనే వ్యక్తి వందల కోట్ల వ్యాపారం చేస్తాడని, ఆయనకు కొంచెం డబ్బులు కావాలని కొందరు వ్యక్తులు బాధిత నర్సును కలిశారు.అప్పుగా రూ.55 లక్షలు ఇవ్వమని, డబ్బు ఇవ్వకపోతే వనపర్తిలోని ఏడు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తానని నమ్మబలికారు.డబ్బులు తీసుకున్న ఆవుల రాజేశ్ నెలరోజుల్లో బాకీ డబ్బులు ఇస్తానని చెప్పాడని, వనపర్తిలో ఇస్తానని చెప్పిన ఏడు ప్లాట్లలో రెండు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశాడని తెలిసి వాపోయింది.తన డబ్బులు తనకు ఇవ్వాలని బాధిత నర్సు ఆవుల రాజేశ్ ఇంటికి వెళ్లి నిలదీసింది.
దీంతో సోమశేఖర్, నక్కల రాజేందర్ యాదవ్, పవన్ రెడ్డి అనే వ్యక్తులు బాధిత మహిళ ఇంటికి వెచ్చి కిడ్నాప్ చేశారు.శంషాబాద్ లోని ఓ లాడ్జిలో నిర్భందించి ఏడుగురు చిత్రహింసలు గురిచేశారు.
తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.