గల్వాన్‌ ఘటనపై చైనా పశ్చాతాపం

రెండు నెలల క్రితం భారత్‌ చైనా బోర్డర్‌ వద్ద జరిగిన ఘటన రెండు దేశాల మద్య తీవ్రమైన వివాదాన్ని లేవనెత్తిన విషయం తెల్సిందే.ఆ సంఘటనలో భారత్‌ జవాన్‌ లు దాదాపుగా 20 మంది మృతి చెందారు.

 Galwan Incident Is Unfortunate, India, Chaina, Galwan Walley, Veedang, Ban Chain-TeluguStop.com

అటు చైనా సైనికులు కూడా మృతి చెందినట్లుగా సమాచారం అందుతోంది.అయితే ఆ విషయాన్ని చైనా మాత్రం పేర్కొనలేదు.

చైనాకు వ్యతిరేకంగా ఇండియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. చైనా వస్తువులను బైకాట్‌ చేయడం కూడా జరిగింది.

ఇలాంటి సమయంలో చైనా ఈ విషయంపై పశ్చాతాపం వ్యక్తం చేస్తున్నట్లుగా ప్రకటన చేసింది.

చైనా రాయబారి వీడాంగ్‌ ఈ విషయమై మాట్లాడుతూ.

భారత్‌ చైనాల మద్య ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం.మళ్లీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగకుండా రెండు దేశాలు చూసుకోవాలని ఆయన అన్నాడు.

భారత్‌ ను చైనా ఎప్పుడు కూడా ప్రత్యర్థి దేశంగా కాకుండా మిత్ర దేశంగానే చూస్తుందని, ముప్పుగా కాకుండా భారత్‌ ను చైనా ఒక అవకాశంగానే భావిస్తుందని పేర్కొన్నాడు.ఏ దేశము ఒంటరిగా అభివృద్ది చెందలేదు.

కనుక రెండు దేశాల మద్య వ్యాపార సంబంధమైన లావాదేవీలు జరగాల్సిందిగా చైనా భావిస్తున్నట్లుగా వీడాంగ్‌ తన ప్రసంగంలో చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube