సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదల అయ్యింది.విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
తెలుగులో ఇప్పటి వరకు డైరెక్ట్ ఓటీటీలో విడుదల అయిన సినిమాల్లో ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను భారీ మొత్తానికి ఈటీవీ కొనుగోలు చేసింది.
ఓటీటీలో వచ్చిన రెస్పాన్స్ కారణంగా దాదాపుగా రెండు కోట్ల రూపాయలకు ఈ సినిమాను కొనుగోలు చేయడం జరిగిందట.
సాదారణంగా ఈటీవీ ఇంత భారీ డీల్‌కు ఆసక్తి చూపించదు.
కాని పోటీ పెరుగుతున్న సమయంలో తప్పని సరి పరిస్థితుల్లో ఇలాంటి చిన్న సినిమాలను అయినా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు.అందుకే రెండు కోట్లు పెట్టి సినిమాను కొనుగోలు చేసి త్వరలో ఈటీవీలో ప్రసారం చేయాలని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఈ సినిమాను సిటీ ఛానెల్లో ప్రచారం చేయడంతో ఈటీవీ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్‌లోని ఒక లోకల్ ఛానల్ ఈ సినిమాను ప్రసారం చేయడంతో లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేసింది.
అయితే మద్యవర్తులు కాస్త చర్చలు జరపడంతో లీగల్ నోటీసులను ఈటీవీ యాజమాన్యం వెనక్కు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.మరోసారి ఏ సినిమాల విషయంలో ఇలాంటివి పునరావృతం అవ్వొద్దు అంటూ హెచ్చరించడం జరిగింది.