"లేడీ" గా రాబోతున్న హీరోయిన్ మాధవిలత...!

అతిథి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తెలుగు అమ్మాయి మాధవిలత.ఆ తర్వాత నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా నటించింది.

 Lady, Madavi Latha, Heroien, Suspense, Monoplay, Heroine Madhavi Latha In Lady-TeluguStop.com

ఈ హీరోయిన్ సినిమాల్లో తన సోషల్ మీడియాలో ఎక్కువగా తన అభిమానులని పలకరిస్తూ ఉంటుంది.ఇక నచ్చావులే సినిమా తర్వాత… ఆవిడ టాలీవుడ్ లో స్నేహితుడు, అరవింద్ 2 లాంటి సినిమాలలో నటించింది.

నటించిన ఆవిడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.దీంతో సినిమాల్లో అవకాశం రాలేక ఇబ్బందులకు గురైన తర్వాత, ఆవిడ రాజకీయాల వైపు మొగ్గు చూపింది.దీంతో ఆవిడ మొదటగా నా భారతీయ జనతా పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చింది.అప్పటినుండి తనదైన శైలిలో రాజకీయపరంగా తన మార్కును చూపిస్తూ ముందుకు సాగింది.

అయితే తనకి ఇష్టమైన సినిమా ఇండస్ట్రీని మరోసారి పలకరించబోతోంది.అయితే ఈసారి మాత్రం సోలో పర్ఫామెన్స్ లో మోనో ప్లే పద్ధతిని అనుసరించి కళ్యాణ్ డైరెక్షన్ లో రియల్ లైఫ్ థ్రిల్లింగ్ ఎమోషన్ డ్రామాగా సినిమాను రూపొందించబోతున్నారు.


ఇక ఈ సినిమాకు లేడీ అనే టైటిల్ ని ఎంచుకున్నారు.ఈ మోనో ప్లే ఎక్స్పరిమెంట్ సినిమాని చరణ్ క్రియేషన్ పై సత్యనారాయణ,కళ్యాణ్ నిర్వహించబోతున్నారు.సినిమా అమాంతం కేవలం ఒక క్యారెక్టర్ తోనే తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు తెలియజేశారు.ఈ సినిమా మొత్తానికి హీరోయిన్ మాధవి లత నటన ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని ఆయన తెలియజేశారు.

ఈ సినిమాలో కచ్చితంగా సినిమా ప్రేక్షకులు ఆదరిస్తారని చిత్రబృందం భావిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube