ఈ మధ్య అధికార పార్టీ వైసీపీకి అసలు టైం బాగుండటం లేదు.వారు మంచి చేద్దామని మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కోర్టులు మెట్లెక్కడం తో పూర్తిగా ఆగిపోతున్నాయి.
ఇలా ఎందుకు జరుగుతుందని ప్రభుత్వం విశ్లేషించుకునట్లు కనిపించట్లేదు.అందుకే ప్రభుత్వానికి వరుసగా దెబ్బ మీద దెబ్బ ఎదురవుతున్నాయి.
ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే తాజాగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వైసీపీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది.
సరిగ్గా సీఎం జగన్ అక్కడికి చేరేసరికి ఆయన పోడియంను అనుకొని ఉన్న మీడియా గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఏసీ నుండి పొగలు రావడం మొదలైంది.
ఈ విషయాన్ని గమనించిన అధికారులు వెంటనే స్పందించి ఏసీకి పవర్ సప్లైను కట్ చేశారు.ఈ కార్యక్రమంలో జరిగిన అపశృతి వల్ల ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఆతరువాత జాతీయ జెండా ఆవిష్కరణోత్సవ కార్యక్రమం అంతరాయం లేకుండా విజయవంతంగా పూర్తయింది.
ఈ కార్యక్రమానికి ముందు సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా దేశ స్వాతంత్రం కోసం కృషి చేసిన నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ వారు అందించిన స్వేచ్ఛను దేశ అభ్యున్నతికి,దేశ ప్రతిష్టను పెంపొందించడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.