“తానా” ఆధ్వర్యంలో కన్నుల పండుగగా “స్వాతంత్ర దినోత్సవ” వేడుకలు...!!

ఉత్తర అమెరికాలో తెలుగు సంఘం (తానా) భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించడంలో, తెలుగు పండుగలను అమెరికాలో నిర్వహించడంలో ఎప్పుడు ముందు ఉంటుంది.అమెరికాలో తెలుగు ఎన్నారైలు అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి సందర్భాను సారంగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది.

 Tana To Celebrate Independence Day Celebrations, Independence Day Celebrations,-TeluguStop.com

ఈ క్రమంలోనే త్వరలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తానా లో భాగమైన ప్రపంచ సాహితీ వేదిక ఆధ్వర్యంలో 74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలని నిర్వహించనుంది.

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉన్న డా.ప్రసాద్ తోట కూర మాట్లాడుతూ ఆగస్టు 15 సందర్భంగా ఆన్లైన్ లో వివిధ దేశాల నుంచీ 74 మంది సాహితీ వేత్తలు గేయ కవిత్వం,పద్య కవిత్వం వచన కవిత్వం వంటి వివిధ ప్రక్రియలతో భారత మాతకు సాహిత్య హారతి సమర్పించనున్నారని అన్నారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా తెలుగు జాతికి చెందిన గవర్నర్లు , మాజీ గవర్నర్లు, కీలక అధికారులు పాల్గొంటారని తెలిపారు.ముఖ్యంగా

హిమాచల్ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ , మాజీ ముఖ్యమంత్రి , మాజీ గవర్నర్ రోశయ్య , మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు, పలువురు ఐ.పీ.ఎస్ లు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారని తెలిపారు.అలాగే సాహితీ కారక్రమానికి ప్రఖ్యాత సినీ రచయితలు సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోస్ ,అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, భువన చంద్ర, వెన్నెలకంటి, వంటి వారు హాజరవుతారని అన్నారు.ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం ఆగస్టు 15 తేదీ రాత్రి 7.30 నిమిషాలకి ప్రారంభం అవుతుందని లైవ్ లో వీక్షించాలని అనుకునే వారు తానా ఫేస్ బుక్ లింక్ https://www.facebook.com/TANA.ORG/ ద్వారా వీక్షించ వచ్చని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube