కంగనా రనౌత్ : నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడే 28 ఏళ్ళ వ్యక్తితో ప్రేమలో పడ్డా...

ఎప్పుడూ ఏదో ఒక ఈ విషయంపై స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచేటువంటి “బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగనా రనౌత్” గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది ఇందులో భాగంగా “శృంగారం పై అవగాహన” అనే విషయంపై చర్చిస్తూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

 Kangana Ranaut, Bollywood Star Heroine, First Love, Bollywood-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా చిన్న పిల్లలకు శృంగారం గురించి అవగాహన అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.అంతేగాక కొంతమంది పిల్లలకు ప్రస్తుత కాలంలో శృంగారంపై సరైన అవగాహన లేకపోవడంతో అత్యాచారాలకు గురవుతున్నారని, అలాగే మరికొంత మంది మైనర్లు కూడా మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారని తెలిపింది.

అంతేగాక తాను 17 సంవత్సరాల వయసు 25 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తితో ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది.కానీ ఆ సమయంలో తనని అందరూ చిన్న పిల్లని అన్నారని సరదాగా చెప్పుకొచ్చింది.

అయితే శృంగారం పట్ల కంగనా రనౌత్ చేసినటువంటి వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ ట్రోల్ చేస్తున్నారు.అంతేగాక కంగనా రనౌత్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కొంత మంది మద్దతుగా నిలుస్తున్నారు.

  చిన్నప్పటి నుంచే శృంగారం పట్ల సరైన అవగాహనా కల్పించడం వల్ల యువతీ యువకులు కౌమార దశలో తప్పుదోవ పట్టకుండా ఉంటారని అంతేగాక మహిళల పట్ల మంచి గౌరవ మర్యాదలు  ప్రవర్తిస్తారని అభిప్రాయం  చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కంగనా రనౌత్ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విజయ్ దర్శకత్వం వహిస్తున్న టువంటి తలైవి అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రం సీనియర్ నటి మరియు తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి జయలలిత జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోంది.అలాగే బాలీవుడ్లో దాకాడ్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube