పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ అందులో పింక్ రీమేక్ “వకీల్ సాబ్” సినిమాను దాదాపుగా పూర్తి చేశాడు.
ఈ సినిమా పవన్ చేయడం పై పలువురు పలు రకాలుగా అనుకున్నారు.అసలు ఇలాంటి కథ పవన్ కు ఎలా సూట్ అవుతుందని చేస్తున్నాడు అన్నారు.
వకీల్ సాబ్ తర్వాత పవన్ చేయబోతున్న మూవీ కి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నాడు.ఆ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అవుతోంది.
ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా, ఇందులో పవన్ దొంగ గా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.పవన్ ను దొంగగా చూపించబోతున్న క్రిష్ అందరిని ఆశ్చర్య పర్చుతున్నారు.
అసలు పవన్ ఇలాంటి పాత్రలకు కథలకు ఎలా ఒప్పుకున్నాడు.పవన్ క్రేజ్ కు ఇమేజ్ కు సూట్ అయ్యేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పవన్ కథ విషయంలో పెద్దగా పట్టింపులు లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు అనిపిస్తుంది.గతంలో మాదిరిగా కథ ల విషయంలో పవన్ పట్టుదలను ప్రదర్శించడం లేదనిపిస్తుంది.
పవన్ 28 సినిమా కథ విషయంలో కూడా అదే విషయం రుజువు అవుతుంది.ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన కథను హరీష్ శంకర్ ఇటీవల పవన్ వద్దకు తీసుకు వెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథను పవన్ ఒప్పుకున్నాడు అంటూ పుకార్లు వస్తున్నాయి.ఈ సమయంలోనే పవన్ కథ విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు.
నిర్మాతలు కథపై సంతృప్తి చెందితే అప్పుడు సినిమా కు పవన్ ఓకే చెబుతున్నాడు.పారితోషికాల కోసమే పవన్ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు అని ఈ పరిస్థితులను చుస్తే అర్ధం అవుతోంది.
ఏది ఏమైతేనేం పవన్ ఫ్యాన్స్ కోరిక మేరకు ఆయన ఎక్కువ సినిమా లు చేస్తున్నాడు.