మిల్కీ బ్యూటీని లైన్‌లో పెడుతున్న యాక్షన్ హీరో!

కన్నడలో తెరకెక్కిన కేజీఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.పూర్తి కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మాస్ వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సూపర్ సక్సెస్ అయ్యింది.

 Yash, Kgf, Kgf Chapter2, Tamannaah, Sandalwood News-TeluguStop.com

ఇక మిగతా వర్గాల ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.దీంతో ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా అదిరిపోయే హిట్ అందుకుంది.

దీంతో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అయిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు హీరో యశ్.ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీలో హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నాడట యశ్.గతంలో కేజీఎఫ్ మొదటి భాగంలో ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా నర్తించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు యశ్ నెక్ట్స్ చిత్రంలో తమన్నాను తీసుకోవాలని సదరు చిత్ర యూనిట్ భావిస్తోంది.దీంతో కన్నడలోనూ తమన్నా తనదైన మార్క్ వేసుకునేందుకు రెడీ అవుతుందని ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరి కన్నడలో తమన్నా ఎలాంటి ఎంట్రీ ఇస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube