2018,సెప్టెంబర్ 14 న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఘటన ప్రణయ్ అనే యువకుడి దారుణ హత్య.కూతురు కులాంతర వివాహం చేసుకుంది అన్న కోపం తో కక్ష్య పెంచుకున్న ఒక కసాయి తండ్రి అల్లుడిని అత్యంత దారుణంగా కిరాయి హంతకుల చేత హత్య చేయించిన ఘటన తెలిసిందే.
అయితే ఈ దారుణానికి పాల్పడిన మారుతీరావు గత రాత్రి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది.సెప్టెంబర్ 14 వ తేదీన మిర్యాల గూడ లోని ఆసుపత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రణయ్ పై దాడి చేసిన కిరాయి హంతకుడు దారుణంగా నరికి చంపాడు.
ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.కులాంతర వివాహాలు చేసుకుంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ఆ యువతి అమృత తండ్రి మారుతీరావు పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.
ప్రణయ్ దారుణ హత్య తరువాత అమృత తన తండ్రి మారుతీరావు పై పోలీసులకు ఫిర్యాదు చేయడం తో పోలీసులు అతడిని అరెస్ట్ కూడా చేశారు.ప్రణయ్ హత్య కేసులో బలమైన సాక్ష్యాలు లభించడంతో మారుతీరావుకు శిక్ష పడడం ఖాయం అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకో వైపు.గత కొంతకాలంగా మారుతీరావు, ఆయన సోదరుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
తన పేరు చెడింది, సమాజంలో తిరగలేక పోతున్నాం, ఆస్తిని తన కుమారుల పేరు మీద రాయాలంటూ మారుతీరావుపై ఆయన సోదరుడు ఒత్తిడి తెలుస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కువగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు కూడా వెళ్లకుండా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం బెయిల్ పై వచ్చిన ఆయన హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఖైరతాబాద్ లోని అర్యవైశ్య భవన్ లో ఆయన శనివారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది.
అయితే ఇది నిజంగా ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో పోలీసులు అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తుంది.